విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం(విశ్వం వాయిస్ న్యూస్ ) పి గన్నవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద బుద్ధుని యొక్క జయంతిని అంబేద్కర్ సాహితి సమితి అధ్యక్షులు నేలపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐ ఇ కుమార్ బుద్ధుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధుడు ప్రపంచశాంతి కోసం సర్వమానవ సమానత్వం కోసం కృషి చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు జాతీయ స్వచ్ఛంద సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ కోనసీమ చీఫ్ కోఆర్డినేటర్ కోరుకొండ జాన్ మాట్లాడుతూ బుద్ధుని యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ప్రపంచ శాంతి కోసం అందరూ కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనని పౌండేషన్ అధ్యక్షులు సరెళ్ల ప్రసాద్, కడలి సత్యనారాయణ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది,ఎమ్ రామకృష్ణ,ఎమ్ శ్రీనివాస్,జి గౌతం, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు,