నూతన జిల్లా అధ్యక్షుడిగా గా పట్నాల విజయ్ కుమార్
నియామకం*
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమండ్రి ( విశ్వం వాయిస్ న్యూస్ ) నూతన జిల్లాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బిఎస్పి నూతన అధ్యక్షుడిగా పట్నాల విజయ్ కుమార్ ను ఎన్నిక చేశారు మొదటగా ఐ ఎల్ టి డి జంక్షన్ నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు వచ్చి అంబేద్కర్ కి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేట్ కోఆర్డినేటర్ జి చిత్రసేన పాల్గొన్నారు .అనంతరం అంబేద్కర్ కమిటీ హాల్ లో సమావేశం నిర్వహించి నూతన కమిటీనీ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన జిల్లాకు అధ్యక్షుడు చేయడం ఎంతో ఆనందంగా ఉందని నా మీద ఎంతో నమ్మకంతో జాతీయ పార్టీలో ఈ స్థానాన్ని కల్పించడం చాలా సంతోషకరం గా ఉందని నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని బి ఎస్పి తరఫున పార్టీ చెప్పిన ఆశయాలను నెరవేరుస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో లో ఇంచార్జ్ పరమట గణేశ్వరరావు, రాజు, నల్లి రమేష్, అశోక్ బాబు, ఇసుక పట్ల రాంబాబు, కొండపల్లి సూరిబాబు కొత్త పల్లి శేఖర్ , గెడ్డం ప్రసాద్, సుజిత్, మంద సుబ్రహ్మణ్యం, పల్లె అబ్బులు , బుడ్డు పోతురాజు, నెల్లి ఫోర్ మెన్, సుధీర్ బ్రదర్స్, వంశీ ,బాలరాజు, రాజేష్, శేఖర్ ఏపీ పని యూత్ మరియు అంబేద్కర్ యూత్, జై భీమ్ యూత్ తదితరులు పాల్గొన్నారు.