– జిల్లా ప్రజలు, యువత, స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు…
– పెద్ద సంఖ్యలో దిశా యాప్ రిజిస్ట్రేషన్ డౌన్లోడ్స్ చేయించాలని పిలుపునిచ్చిన ఎస్పి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, ( విశ్వం వాయిస్ న్యూస్ )
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగస్తులు విద్యార్ధులు, మహిళల రక్షణకు తమ వంతు భాద్యతగా భావించి ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొనాలని జిల్లా ఎస్పీ కోరారు.
ఎస్పీ ఎమ్.రవీంద్రనాధ్ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, భద్రతలో భాగంగా రేపు అనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దిశ యాప్ ప్రత్యేక డ్రైవ్ లో ప్రతీ ఒక్కరూ, తప్పనిసరిగా పాల్గొని, తమ స్మార్ట్ ఫోన్లలో దిశ ఎస్ ఓ ఎస్ యాప్ ను స్వచ్ఛందంగా డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ చేసుకొని, మహిళల భద్రతకు పోలీసు శాఖ చేపడుతున్న భద్రత చర్యలకు తమవంతు సహకారాన్ని స్వచ్ఛందంగా అందించ వలసిందిగా జిల్లాలోని ప్రజలకు ఎస్పీ బాబు పిలుపునిచ్చారు. మహిళల రక్షణ, భద్రత కొరకు జిల్లా పోలీసు శాఖ చేపట్టనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాలుపంచుకొని దిశ (SOS )యాప్ డౌన్లోడ్ ,రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ ఈ ప్రకటన ద్వారా పిలుపునివ్వడం జరిగింది.