Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సామాన్యులకు షాక్.. ఆగిపోయిన ఉచిత బియ్యం…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:

 

శంఖవరం, మే 17, (విశ్వం వాయిస్ న్యూస్) ;

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా సామాన్య జనం అనేక కష్టాలు పడ్డారు. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక ఆకలి పస్తులతో అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజలు పస్తులతో ఉండకూడదన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేషను కార్డుదారులు అందరికీ ఉచిత బియ్యం అందించేందుకు పూనుకుంది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం పేరిట రేషన్‌ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని, ఒక కిలో కంది పప్పును పంపిణీ చేయాలని నిర్ణయించింది. తొలి నాళ్లలో వీటితోపాటు గోధుమలు, శనగలు కూడా పంపిణీ చేసింది. కొన్నాళ్ల తరువాత కందిపప్పు, గోదుమలు, శనగల పంపిణీ ఆగిపోయి నప్పటికీ ప్రతి ఆరు నెలల కొకసారి చొప్పున పొడిగిస్తూ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ గడువు 2022 మార్చితో ముగిసింది. ఇప్పుడిప్పుడే కరోనా కష్టాల నుంచి ప్రజలు కోలుకుంటున్న నేపథ్యంలో మరో ఆరు నెలలపాటు ఈ పథకాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ దేవుడు కరుణించినా, పూజారి వరమీయనట్లు ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం ఏమీ లేవు.

భారత దేశ కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని నిలపి వేసింది. కరోనా కారణంగా దాదాపుగా రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం దేశంలోని రాష్ట్రాలకు కేంద్రం ధాన్యం లేదా, డబ్బులు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ధాన్యం పండించే రాష్ట్రం కావడంతో కేంద్రం నుంచి నగదు
తీసుకుంటుంది. ఉచిత బియ్యం పంపిణీ మార్చిలోనే ముగియాల్సింది ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఇంకో ఐదు నెలల వరకు పెంచింది. కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నిల్వ చేసిన బియ్యం లేకపోవడంతో ఏప్రిల్ నుంచి ఉచిత బియ్యం పంపిణీ నిలిపి వేసింది. ఆ వెనువెంటనే మే నెలలో మళ్ళీ ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు గతంలో తెలిపారు. కానీ, మే నెల వచ్చి పుక్షం రోజులు పూర్తి అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో ఇప్పుడు కూడా ఉచిత బియ్యం ఇవ్వడం కుదరదని డీలర్లు తేల్చి చెప్పారు.

ఇప్పటికీ పూర్తి కాని రేషన్‌ పంపిణీ…
_______________________

దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఉచిత బియ్యం అందుతున్నాయి. కాగా ఈ ఏప్రిల్‌ 4 న ఆంధ్ర్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజనకు పూనుకుంది. దీంతో జిల్లాల్లోని పౌర సరఫరాల శాఖలు కూడా ముక్కలు అయ్యాయి. ఈ విభజన కారణంగా రేషన్‌ సరఫరా కుంటుబడింది. దీంతో ప్రతి నెలా 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన నెల వారీ రేషన్‌ పంపిణీ ఆలస్యంగా మొదలవుతోంది. ఇప్పటి వరకూ ఈ పంపిణీ పూర్తికాలేదు. బియ్యం తోపాటు ఇచ్చే కంది పప్పు, పంచదార పంపిణీ చాలా చోట్ల ప్రారంభం కూడా కాలేదు. ఈ నేపథ్యంలో ప్రతి నెల 15 నుంచి ప్రారంభం కావాల్సిన ఉచిత బియ్యం పంపిణీ ఊసే లేకుండా పోయింది. అధికారులకు కూడా బియ్యం పంపిణీకి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో బియ్యం పంపిణీ ఆగిపోయింది. దీంతో లబ్దిదారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఉచిత బియ్యం పంపిణీకి ఆదేశాలు లేవు:
____________________________

ఉచిత బియ్యం పంపిణీకి సబంధించి మాకు అధికారుల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు లేవు. అందువల్ల ఈనెల ఉచిత బియ్యం పంపిణీ ఉంటుందో లేదో చెప్పలేము అని జిల్లాల పౌర సరఫరాల అధికారులు అంటున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement