Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గోకవరం భూ కబ్జాలపై స్పందించిన జ్యోతుల

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గోకవరం భూ కబ్జాల పై స్పందించిన జ్యోతుల

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, గోకవరం:

గోకవరం భూ కబ్జాలపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.
ఎంతటి వారినైనా ప్రజాకోర్టులో నిలబెడతా.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మే 17: స్థానిక బత్తుల సత్తిబాబు గారి స్వగృహంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గోకవరం గ్రామంలో ఎక్కడ చూసినా భూ కబ్జాదారులు చెలరేగి పోతున్నారని, ప్రభుత్వ స్థలం ఎక్కడ కనబడ్డ కబ్జాలు చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు అని అందులో భాగంగానే క్రిస్టియన్ మైనారిటీ కి కమ్యూనిటీ హాల్ కోసం సాక్షాత్తు నేను శంకుస్థాపన చేసిన స్థలాన్నే కబ్జా చేసి అమ్మి వేయడం జరిగిందని అంతే కాకుండా మెయిన్ రోడ్డు లో గల పంచాయతీ స్థలం మరియు బందుల దొడ్డి స్థలాన్ని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని, పంచాయతీ వారు ఈ స్థలం పంచాయతీ కి సంబంధించి స్థలమని బోర్డు పెట్టిన లెక్కచేయకుండా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని తెలియజేశారు. గోకవరం పరిసర గ్రామాలకు ఆయకట్టు రైతాంగానికి ఆయువుపట్టు లాంటి ఊర కాలువను కబ్జా చేయడం వలన, రేపటి రోజున చుట్టుపక్కల ఎన్నో ఏళ్ల తరబడి నివాసం ఉన్నటువంటి ప్రజలకు ప్రమాదం పొంచి ఉన్నదని తక్షణమే ఈ అక్రమ కట్టడాలను ఆపాలని నెహ్రూ డిమాండ్ చేశారు. వందల సంవత్సరాల నాటి చెట్లను కూడా ఈ అధికార పార్టీ నాయకులు వదలడం లేదని, కొన్ని లక్షల రూపాయలకు చెట్లను కూడా అమ్మి వేయడం జరిగినదని  జరిగిందని, ఈ మూడేళ్ల పరిపాలన సమయంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికార పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని, వీరిని ప్రధాన ప్రతిపక్షమైన మనం గట్టిగా ఎదుర్కోవాలని, ప్రజలకు న్యాయం చేయటం కొరకై తన మన బేధం లేకుండా ఏ పార్టీ వారైనా బయటకు లాగి  ప్రజాకోర్టులో దోషిగా  నిలబెడతానని, ఎవర్ని వదిలే ప్రసక్తే లేదని జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ జగ్గంపేట నియోజకవర్గం అధికార పెద్ద కనుసన్నల్లోనే జరుగుతుందని ఆయన వివరించారు.దీనిపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికైనా స్పందించి ఊర కాలువ కబ్జాలను ఆపాలని,  చెట్లు అమ్మిన వారిని బయటకు లాగి, సొమ్మును రికవరీ చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలకు అడ్డుగా ఉన్నాయని ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ లను కూడా తొలగిస్తున్నారు. అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు మంగరాతు రామకృష్ణ, అడపా భరత్ కుమార్, ఉంగరాల రాము, ఈది అశోక్, గునిపే భరత్, కన్నబాబు, పాలూరి బోసు బాబు, బత్తుల సత్తిబాబు, ఉంగరాల గణేష్, పోసిన ప్రసాద్, గుండా శివ ప్రసాద్, బద్ది రెడ్డి అచ్చన్న దొర, మలిరెడ్డి సిరి, మండిగ. బాలాజీ, నలమహారాజు, వెంకటపతి, నాకు మండీగ.గంగాధర్, కొంగర పు రాజు, వరసల గుబ్బ రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement