కేత శ్రీను
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్ )
రాష్ట్రంలో బలహీన వర్గాలపై వైఎస్సార్ పార్టీ సవతి తల్లి ప్రేమ చూపుతోందని. అలంకార ప్రాయంగా పదవులు బీసీలకు ఇచ్చి, పెత్తనం ఇతరులకు అప్పజెబుతోందని టీడీపి బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కేతా శ్రీను అన్నారు. మండల కేంద్రం రావులపాలెంలో స్థానిక టిడిపి పార్టీ కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ
జిల్లాకు చెందిన మంత్రి వేణుగోపాలకృష్ణ టీటీడీ ఛైర్మన్ ముందు బహిరంగంగా మోకాళ్ళపై వంగి శెట్టిబలిజ కులస్థుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారన్నారు.
నియోజకవర్గంలో బీసీ మహిళా నేత కంట తడి పెట్టించారని,
రాష్ట్రం నుండి రాజ్యసభకు బీసీలు ఎవరూ లేరన్నట్లు పక్క రాష్ట్రం నుండి ఎరువు తెచ్చారని,
బీసీ కార్పొరేషన్ కు నిధులివ్వరు,
చేతి వృత్తులు వారికి ప్రోత్సాహం చేయదని, వైసీపీ ప్రభుత్వం బీసీలను మభ్య పెట్టడానికి అంకెల గారడీ చేస్తోందని ఈ సందర్భంగా కేతా శ్రీను ఆక్షేపించారు…