Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రపంచానికి మనల్ని పట్టిచ్చే గూగులమ్మ…!

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, 20 మే 2022, (విశ్వం వాయిస్ న్యూస్) ;

గూగుల్ అంటే ఇది ఒక సంస్థ పేరు. అంతర్జాలంలో మన అన్వేషణకు ఆధారభూతమై ఒకానొక బ్రాంతికరమైన, అభౌతికమైన ఉపకరణ సాధనం. గూగుల్ అనే ఆంగ్ల పదానికి తెలుగు భాషలో నిర్ధిష్టమైన అర్ధాన్ని సదరు గూగుల్ సంస్థే ఇంకా చెప్పలేదు గనుక, త్వరలోనే సరియైన అర్ధాన్ని చెప్తామని గూగుల్ సంస్థ ప్రకటిస్తోంది గనుక, ఇదొక సర్చ్ ఇంజన్ అని ఇది వరకే గూగుల్ సంస్థ ఆంగ్ల భాషలో అర్ధం చెప్పింది గనుక తెలుగు భాషలో అర్ధం పరమార్ధాన్ని పక్కన పెడదాం. ఇక అసలు విషయానికి వస్తే… ఈ గూగులమ్మ మనల్ని, మన రహస్యాల్నీ ఈ ప్రపంచానికి పట్టిచ్చే ఒకానొక గూడఛారి అని ఆ గూగుల్ ను నిత్యం అనుక్షణం ఉపయోగిస్తున్న వినియోగదారుల్లో చాలా మందికి తెలియదు.

మన గూగుల్ మనపైనే గూడచారి …!

_________________________

ఈ గూగుల్ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్) ముందు సహజమైన మానవ మేధస్సు కూడా ఒకోసారి బోల్తా పడుతుంది. అదెలా అంటే మీ ఆండ్రాయిడ్ మోబైల్ ఫోనులో ఉన్న ఉపకరణా(అప్లికేషన్సు)ల్లో లొకేషన్ అనే ఉపకరణాన్ని మీరు ఉపయోగం(ఆన్)లో ఉంచినట్లైతే ఒక్కో సారి మనం నిజంగానే ఇబ్బందుల్లో పడతాం. మనం ఆన్ లో ఉంచింది లొకేషన్ అప్లికేషన్ ఐనప్పటికీ మన వ్యక్తిగత భాగోతాల్ని పట్టిచ్చేది మాత్రం చల్లని జాబిలమ్మలా పైకి నిర్మలంగా కనిపిస్తూండే ఈ గూగులమ్మలో అంతర్గతంగా నిర్మితమై ఉండే ఒకాకొన బయంకరమైన పట్టిచ్చే రాక్షస గుణం. ఈ గుణం పేరే ఆంగ్ల భాషలో గూగుల్ ట్రాకింగ్. ఎందుకంటే …. టెక్ దిగ్గజం గూగుల్‌ మీ లొకేష‌న్‌ను ట్రాక్ చేస్తుంది. మన దైనందిన కార్య కలాపాల్ని మన అనుమతి లేకుండానే ఓ గూడచారిలా కనిపెడుతూ తనలో భధ్రంగా నిక్షిప్తం చేసుకోడమే గాకుండా అవసరమైనప్పుడు బయట పెడుతుంది. మనల్ని భయపెడుతుంది. ఇబ్బందులకు గురి చేస్తుంది.

లొకేషన్ సర్వీస్‌ను ఆన్ చేసి ఉంటే,

______________________

వినియోగదారు మొబైల్‌లో లొకేషన్ సర్వీస్‌ను ఆన్ చేసి ఉంటే, వినియోగదారు ఎక్కడికి వెళుతున్నారు? ఏ ప్రదేశంలో ఎంత సమయం గడుపు తున్నారు? అనే విషయం గూగుల్‌కు తెలిసి పోతుంది. ఇది కాకుండా వినియోగదారు ఏ వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు ? ఏ యాప్‌లో ఎంత సమయం గడుపు తున్నారు? త‌దిత‌ర‌ సమాచారాన్ని కూడా గూగుల్‌ కలిగి ఉంటుంది. దీనితో పాటు గూగుల్‌ క్యాలెండర్ మీ అన్ని ఈవెంట్‌లను ట్రాక్ చేస్తుంది. ఇంతే కాదు వినియోగదారు ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఆటోఫిల్‌ను ఉంచినట్లయితే, గూగుల్ క్రెడిట్ కార్డ్, సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను కూడా సేవ్ చేస్తుంది. వినియోగదారు ఏదైనా సమాచారాన్ని కోరికున్నప్పుడు, అతను గూగుల్లో శోధిస్తాడని మన అంద‌రికీ తెలిసిందే.

ఏ స‌మాచారం ఉందో ఇలా తెలుసుకోవచ్చు …

______________________________

అటువంటి పరిస్థితిలో మీరు గూగుల్‌లో శోధించే దాని గురించిన‌ సమాచారాన్ని గూగుల్ కలిగి ఉంటుంది. మీరు మొదట దేని కోసం వెతికారు? దీనితో పాటు మీ యూ ట్యూబ్ డేటా కూడా గూగుల్‌ వద్ద ఉంటుంది. వినియోగదారు శోధన చరిత్ర గూగుల్‌లో సేవ్ అవుతుంది. అయితే గూగుల్ ద‌గ్గ‌రున్న మీ డేటాను మీరు కనుగొనవచ్చు. గూగుల్‌ డేటాను యాక్సెస్ చేయడానికి మీ జీమెయిల్‌కి లాగిన్ చేయండి. ఆ తర్వాత గూగుల్‌ ఖాతాకు వెళ్లండి. ఇక్కడ మీరు డేటా అండ్‌ గోప్యత ఎంపికను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఎక్కడెక్క‌డికి వెళ్ళారో, ఏం చేశారో మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసినప్పుడు మీకు మొత్తం డేటా వస్తుంది. ఇందులో మీరు యూట్యూబ్‌లో ఏం సెర్చ్ చేశారో కూడా తెలుస్తుంది. గూగుల్ ఖాతాలో మై గూగుల్ యాక్టివిటీ ఆప్షన్ ద్వారా మీరు శోధించిన వివ‌రాల‌ను మీరు చూడ‌ వ‌చ్చు. ఉదాహరణకు మన పిల్లలు కంప్యూటర్లో, టాబ్ ల్లో, ల్యాప్ ట్యాప్ లో, ఆండ్రాయిడ్ ఫోను ఉపకరణాల్లో చూడకూడనివి చూసి, చేయకూడనివి చేసి ఉంటే ఆ తర్వాత మనం తెలుసుకోవచ్చు. అంటే మన పిల్లల బండారం మనకు తెలిసిపోతుంది. అలాగే మన బండారం కూడా పోలీసులకూ, ఈ ప్రపంచానికీ మన ఖర్మ కాలినప్పుడు తెలిసి పోతుంది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement