Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ తోట..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:

 

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )

నల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించతలపెట్టిన రైతు భరోసా కేంద్ర0నకు నేడు శనివారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు భూమి పూజ చేసారు. రైతులు ఏ అవసరం వున్న మండల వ్యవసాయ కార్యాలయం అవసరం లేకుండా గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ద్వారా తమ అవసరాలు తీర్చు కోవొచ్చు అనే సంకల్పంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో ఇటువంటి భవనాలు నిర్మాణాలు చేపట్టుతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు.రాయితీ విత్తనాలు, ఎరువులు, ఇన్ పుట్ సబ్సిటీ, భూసార పరీక్షలు, సాగు సలహాలు వంటి ఏఅవసరం వున్నా రైతులు ఈ ఆర్ బీ కే ల ద్వారా ప్రయోజనం పొందవచ్చును అని ఎమ్మెల్సీ తోట అన్నారు. రైతు భరోసా కేంద్రానికి స్థలం ఉదారంగా ఇచ్చిన దాత వేగుళ్ళ గంగ ప్రభాకర్ చౌదరిని గ్రామస్థుల సమక్షంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శాలువా తో సత్కరించారు.అనంతరం తోట త్రిమూర్తులు చెత్త నుండి సంపద సృష్టి కేంద్రం వద్ద నిర్మించిన జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవిష్కరించారు. గ్రామ పెద్దలు కోరిక పై ఎమ్మెల్సీ తోట శిధిలావస్థలో వున్న స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ కురుపూడి ఉదయ శ్రీ రాంబాబు, జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చుండ్రు చిట్టి బాబు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పుట్టా కృష్ణబాబు, పి ఏ సీ ఎస్ చైర్ పర్సన్ ముత్యాల నారాయణ రావు, వైస్ ప్రెసిడెంట్ మార్ని అనంత లక్ష్మీ పూసబ్బు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అతికెల శంభు లింగం, కురుపుడి శివ శంకరం, సవిలే శరత్ బాబు, వైస్ ఎంపీపీ గుణ్ణం భాను ప్రసాద్, ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్, వైసీపీ నాయకులు మేడిసెట్టిదుర్గారావు, నక్క సింహాచలం, మాట్టపర్థి పాల రాజు, వంగా నల్ల శ్రీను, ప్రగడ అర్జునరావు, సలాధి వీరబాబు,బడుగు రాంబాబు, కవల శ్రీనివాస్, పాలంగి కిషోర్, తహసిల్దార్ చిన్నా రావు, ఎంపిడివో వెంకట్రామన్, ఏ. ఓ. రమేష్ కుమార్, జే ఈ రాఘవులు,ఆర్ ఐ జనార్దన్, కార్యదర్శి రామకృష్ణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement