Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సొంతింటి కల నెరవేర్చేందుకు నవరత్నాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– నిడిగట్ల గ్రామంలో హౌసింగ్ కాలనీ తనిఖీ చేసిన కలెక్టర్ మాధవిలత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కోరుకొండ:

 

కోరుకొండ, విశ్వం వాయిస్ః

నిడిగట్ల గ్రామంలో 177 ఇల్లు నిర్మాణం కోసం లబ్ధిదారులకు స్థలాలు కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో జగనన్న కాలనీ లేఅవుట్ ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు నవరత్నాలు లో భాగంగా భూ సేకరణ చేసి ఇండ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణం చేపట్టేలాగా అధికారులు సిబ్బంది పని చేయాల్సి ఉందన్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 15 వేల రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ మొత్తం సరిపోవడం లేదని లబ్ధిదారులు చెప్పడంతో స్వయం సహాయక సంఘాలకు చెందిన సభ్యులకు డి ఆర్ డి ఎ ద్వారా మరో 50 వేల రూపాయలు రుణాన్ని మంజూరుచేసే విధంగా చర్యలు చేపట్టాలని ఏపి ఎమ్ కు సూచించారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు దశలవారీగా చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వమే ఇసుక సిమెంటు ఐరన్ ను లే అవుట్ లలోనే ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. కాలనీల్లో త్రాగునీరు విద్యుత్ సౌకర్యాన్ని ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారులు సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ప్రభుత్వం చేస్తున్న ప్రయోజనాలను ఇప్పటికే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించాలని తెలిపారు.

పూర్తి అయిన గృహాలకు విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్తు శాఖ ఏఈ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ ఈఈ జి. సోములు, డి.ఈ. డి పరశురామ్ తాహాసిల్దార్, ఎం పి డి ఓ, ఏ పి డి ఎం విద్యుత్ శాఖ, ఆర్డబ్యూఎస్ ఏఈ లు, సచివాలయ సిబ్బంది హాజరయ్యారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement