Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 7:17 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 7:17 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 7:17 PM
Follow Us

మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పెట్టిన ఆందోళనకారులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* జిల్లా పేరు పై అట్టుడికిన అమలాపురం
* కోనసీమ కోపంతో అమలాపురం ఉద్రిక్తం…
* అట్టుడికిన ఉద్యమం
* చిచ్చు రేపిన జిల్లా పేరు వివాదం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం, మే 24, (విశ్వం వాయిస్ న్యూస్) ;

కోనసీమ కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్‌ విధించిన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంత మంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ప్రైవేట్‌ కాలేజ్‌ బస్సులు దగ్ధం చేశారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

 

కోనసీమ పేరు మార్పు రెండు వర్గాల మధ్య అగాధం రేపింది. ఎప్పుడు కత్తులు దూసుకొనే కాపు, శెట్టి బలిజ సామాజిక వర్గాలు ఏకం కాగా ఎస్సిలు మరో వర్గంగా ఏర్పడ్డారు. ఈ వివాదంలో కోనసీమ జిల్లాలోని ఈ ప్రధాన బలమైన సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేగింది. ఇవి ఎలాంటి పరిమాణాలు దారి తిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. బీసీల్లో ముఖ్యంగా శెట్టి బలిజ, ఓసిల్లో ముఖ్యంగా కాపులు పేరు మార్పుపై ఆగ్రహం గా వున్నారు. ఎస్సి ఇతర వర్గాలు అంబేద్కర్ జిల్లాగా ఏర్పాటు చేయాలని తేడా వస్తే తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి ఇదో పెద్ద తలపోటులా మారింది.

 

గతంలో 1988 లో వంగవీటి రంగా హత్య అనంతరం ఒక్కసారిగా కోనసీమ భగ్గుమంది. ఆనాటి ఉద్యమ రూపం ఇప్పుడు కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పోలీసులు నిషేధాజ్ఞలు విధించినా వాటిని లెక్క చేయకుండా అమలాపురం అట్టుడికింది.

కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి మంగళవారం నాడు టెన్షన్ కు దారి తీసింది. జెఏసీ నేతలతో పాటు ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన కారులను కలెక్టరేట్ వైపునకు వెళ్లకుండా పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఎస్పీ.సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ల దాడికి దిగారు. ఎస్పీ గన్ మెన్లు, డీఎస్పీకి గాయాలు అయ్యాయి.

 

అమలాపురం పట్టణం ముట్టడికి జేఏసీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఈ అలజడి రేగింది. ఆందోళన నేపధ్యంలో అమలాపురంతో బాటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అమలాపురంలో 25 చోట్ల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కసారిగా జేఎసీ నేతృత్వంలో ఆందోళనకారులు గడియారం స్థంభం నుండి కలక్టరేట్ వరకు ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఎస్ పి వాహనంపై రాళ్లు రువ్వడంతో ఎస్పీ తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించు కున్నారు. అక్కడే ఉన్న డీఎస్పీ, గన్ మెన్లు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితక బాదారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళన కారులను తరలించేందుకు తీసుకు వచ్చిన వాహనాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలు వాహనాలు ద్వంసం అయ్యాయి. ఆందోళన కారులను తరలించేందుకు తెచ్చిన రెండు ప్రభుత్వ వాహనాలను దగ్దం చేశారు. ఆందోళనకారుల దాడిలో డీఎస్పీతో పాటు 20 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసుల లాఠీచార్జీలో కూడా పలువురు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు.

 

ప్రభుత్వం ఇటీవల డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కోనసీమ జిల్లా పేరును మార్చారు. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు ఇచ్చిన వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆందోళనలు నిర్వహిస్తుంంది. బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి లేదని కూడా పోలీసులు చెబుతు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కొందరు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ఉండాలని మరో వర్గం వాదిస్తున్నది. రెండు వర్గాలు పోటా పోటీగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. ఈ రెండు వర్గాలు తమ వాదనలను సమర్ధించు కుంటున్నాయి.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement