Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కష్టం ఎక్కువ””సొమ్ములు తక్కువ””బ్రతకడానికి ఖర్చులు ఎక్కువ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– తక్కువ డబ్బులు పడుతున్నాయని ఉపాధి సిబ్బందిపై
కూలీల ఆరోపణలు.
– ఇప్పటి కైనా పనికి తగ్గ సొమ్ములు చెల్లించాలని కూలీల
డిమాండ్.
– రేకపల్లి సచివాలయం వద్ద గోడు వినిపించిన శ్రమశక్తి
సంఘాల కూలిలు.
సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటే కూలీలకు.
న్యాయం.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:

 

వి .ఆర్.పురం ( విశ్వం వాయిస్ న్యూస్)

25;- వారు నిరంతరం కష్ట జీవులు . నాలుగు వేళ్లు కడుపులోకి వెళ్లాలంటే తమ శరీరాన్ని యండా, వానలకు తడిసి ముద్ద చెయ్యక తప్పదు. పొద్దు పొడిచేలోపే కాలకృత్యాలు తీర్చుకొని, చద్ధనం సంకపట్టుకొని పార, గుణపం భుజాల మీద పెట్టుకొని బతుకు జీవుడా అంటూ బయటకు పనులకు పోతున్నారు. హరోం అని యండలో కష్టపడి పలుగు, పార తో తమ శ్రమను ధారబోస్తున్నారు. ఇటువంటి బడుగులకు, ప్రభుత్వం యంత సొమ్ములు చెల్లించినా తక్కువే అని చెప్పవచ్చు. కానీ ఎక్కువ కష్టం చేసిన వారికి తక్కువ సొమ్ములు వస్తున్నాయని కూలీలు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…….

 

మండలంలోని కొన్నిగ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధిహామీ పథకం నిర్వహిస్తున్నారు. ఆ పధకం లో శ్రమ శక్తి సంఘాలకు పనులు చూపించి వారి జీవనోపాధికి మార్గాలు చూపిస్తుంది. ఆయితే మండలంలో కొంత మంది ఉపాధి సిబ్బంది కొన్ని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కూలీల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాజుపేట కాలనీలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను డబ్బులివ్వాలి అని డిమాండ్ చేస్తున్నట్లు అక్కడ పని చేసే కూలీలు ఆరోపణలు చేస్తున్నారు. డబ్భులు ఇవ్వని కూలీలకు కొంత మందికి తక్కువ డబ్బులు కొట్టుతున్నారని, డబ్బులు ఇచ్చిన మరి కొంత మందికి ఎక్కువ డబ్బులు కొట్టుతున్నారని వీరందరూ కూడా ఒకే చెరువు పనిలో ఉన్నారని, మరి ఈ ఇరువురి మధ్య వ్యత్యాసం ఏమిటనేది మండల అధికారులు తెలియ పరచాలని కూలీలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఉపాధిపని అనంతరం కూలీలు బుధవారం తమ శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని, రేఖపల్లి సచివాలయం ముట్టడించారు.

 

* యం పి డి ఓ వివరణ.

 

కూలీలు ఇంత వరుకు వారి సమస్యలు ఏమిటి అనే విషయం పై మాతో కానీ ఏపీఓ తో కానీ మాట్లాడ లేదు. మీడియా గ్రూపుల్లో వచ్చిన మెసేజ్ లు ద్వారా తెలుసుకున్నాము. ఈ విషయమై ఉపాధి సిబ్బందితో మాట్లాడగా కొంత మంది కూలీలు సమయ పాలన పాటించ కుండా వుంటున్నారని , అందుకే తక్కువ పని చేసిన వారికి తక్కువ డబ్బులు పడ్డాయని సిబ్బంది చెప్పినట్లు యం పి డి ఓ తెలిపారు. కూలీలు సిబ్బందిపై ఆరోపణలు చేశారు కాబట్టి గురువారం ఫీల్డ్ కి వెళ్లి కూలీల సమస్యలు పూర్తిగా తెలుసుకొని న్యాయం చేస్తామని, అదే విధంగా సిబ్బంది తీరును పరిశీలిస్తామని అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement