WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

పాలకుడు సేవకుడు అయితే సంక్షేమ పథకాలు గుమ్మం ముందుకే వస్తాయి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఎంపీ అనురాధ, రాజ్యసభ ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్,
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ :

వైయస్ జగన్ హయాంలోనే గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ జరిగిందని అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ తెలిపారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామక్రిష్ణ అద్వర్యంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన టువంటి గ్రామ సచివాలయం రాయవరం 2, వైయస్ ఆర్ విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాధితులుగా అమాలపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాస్ చంద్ర బోస్, శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో ఎం పి అనురాధ మాట్లడుతూ గతంలో వివిధ పనులపై మండల కేంద్రలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. దీనిని దష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల చెంత చేరువుగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు.

పిల్లి సుభాస్ చంద్రబోస్ మాట్లడుతూ గ్రామ స్వరాజ్యం కోసం మహాత్ముడు కన్న కలలను సాహకారం చేసే దిశగా మన రాష్ట్రంలో రూపుదిద్దుకున్న సచివాలయ వ్యవస్థ ఫలితాలు ప్రతి పల్లెలో, ప్రతి వ్యక్తికీ అందుతూ నేడు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అయన అన్నారు. వైయస్‌ జగన్‌ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతి మండలంలో ఆయన పాదయాత్ర కొనసాగింది. ఆయనకు ఎదురైన అనేక సమస్యలు, ప్రజల కష్టాలు, గ్రామ స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. సామాన్యుడు తన కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పుకునే సమయం వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ రోజు అనేక పంచాయతీలు ఉన్నాయి. సాధారణంగా ఓ వ్యక్తికి, కుటుంబానికి ఇబ్బందులు వస్తే అధికారులకు చెప్పుకుందామంటే ఎవరు అందుబాటులో లేని తరుణంలో ఇలాంటి పరిస్థితులను మార్పు చేసే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2 వేల జనాభా ఉన్న ప్రతి పంచాయతీని గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయడం అదృష్టం. గ్రామ సచివాలయంలో అన్ని శాఖలు ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే ఇక్కడ పరిష్కారం దొరుకుతుందన్న అవకాశం కల్పించరన్నారు.

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే పేపర్‌ మేధావిని 40 ఏళ్ల కుర్రాడు తన పనితనంతో ఢీకొడుతున్నాడు. పది నిమిషాల్లో పెన్షన్, రేషన్‌ కార్డు అర్హులకు అందడం గతంలో ఎప్పుడైనా చూసిన దాఖలాలు ఉన్నాయా..? కానీ పరిపాలనలో నూతన ఒరవడి సృష్టించిన గ్రామ, వార్డు సచివాలయాలు ఇలాంటి అద్భుతాలను చూపిస్తున్నాయి. ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటా అని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైయస్‌ జగన్‌ చెప్పారు.. నాలుగు నెలల్లోనే 4 నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి.. ఈ సంవత్సర కాలంలో తన ప్రయాణంపై ఐదు కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇచ్చాడు. పాలకుడు.. సేవకుడు అయితే సంక్షేమ పథకాలు గుమ్మం ముందుకే వస్తాయని చూపించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 500 పైగా సేవలను అందిస్తున్నారు. అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేసుకోండి.. వలంటీర్లు వచ్చి మీ గుమ్మం ముందుకే వచ్చి సేవలు అందిస్తారని ఆనాడే చెప్పారు.. చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తున్నారు మన సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అయన పేర్కొన్నారు. ముందుగా వారు అమలాపురం ఎం పి అనురాధను, ఎం పి బోస్ ను, ఎమ్మెల్సీ తోటను సర్పంచ్ రామక్రిష్ణ, ఎం పి పి నౌడు వెంకట రమణ లు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన 40 లక్షల రాయవరం గ్రామ సచివాలయ కార్యాలయం 2, 17 లక్షల 50 వేలు రుపాయిలతో నిర్మిచిన వై ఎస్ ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండపేట మార్కెట్ కమిటి చైర్మన్ తేతల వనజ నవీన్ రెడ్డి, అనపర్తి మార్కెట్ కమిటి డైరక్టర్ తేతల సుబ్బిరామిరెడ్డి, రాష్ర వైఎస్ ఆర్ సి పి నాయకులు రిమ్మల పూడి సత్యనారాయణ చౌదరి, జెడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, కోఆప్సన్ సభ్యులు పోలిమాటి సుధాకర్, ఎం పి టి సి2 గంటి రోజా, వార్డు మెంబర్లు మండపల్లి కొండల రావు, కొల్లు వెంకట రమణ రాంబాబు ఎం పి డి వో వి అరుణ, తాసిల్దార్ కే జే ప్రకాష్ బాబు, పంచాయితీ రాజు జే.ఈ. వి రామానారాయణ, పి హెచ్ సి వైధ్యాదికారిని అంగర దేవి రాజ శ్రీ, పంచాయితీ కార్యదర్శి ఎ గోవిందు రాజులు, సచివాలయ కార్యదర్శి ఆకుల నాగ చంద్ర దేవి, వెంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ పులగం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ వైఎస్ ఆర్ సి పి నాయకులు మంతెన్న అచ్యుత రామరాజు, తాడి రామచంద్ర రెడ్డి, తమాలం పూడి గంగాదర్ రెడ్డి, పడాల కమలరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచు లు, ఎం పి టి సిలు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement