విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అన్నవరం:
అన్నవరం, విశ్వం వాయిస్ న్యూస్:
తూర్పుగోదావరి జిల్లా శిష్టకరణ సంఘం నాయకులు వైసీపీ చేపట్టిన బస్సుయాత్రలో అన్నవరంలో వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కలసి శిష్టకరణాల సమాజ స్థి తి గతులను వివరించారు.శిష్టకరణ కులస్తులను అప్పటి ముఖ్యమంత్రి డా..వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వెనుకబడిన కులాలజాబితాలో చేర్చి ఉపకారం చేశారని అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాలనలో కేంద్ర ప్రభుత్వ ఇతర వెనుకబడిన జాబితాలో చేర్చే విషయంలో వేగవంతం చెయ్యాలని కోరారు.కార్యక్రమంలో లో రాష్ట్ర శిష్టకరణ కార్పొరేషన్ డైరెక్టర్ దండుమహంతి లక్ష్మణరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్, పూర్వ జనరల్ సెక్రటరీ ఎస్.కె.వెంకట్రావు మరియు కులస్తులు పాల్గొన్నారు.