Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా చేపట్టాలి….

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )

జిల్లాలో వర్షాల ప్రారంభానికి ముందే నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ఇంటి నిర్మాణాలు ముమ్మరంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా…..రెవెన్యూ, సర్వే, ట్రాన్స్ కో, హౌసింగ్, పంచాయతీరాజ్, ఉపాధి హామీ తదితర శాఖల అధికారులతో కలిసి పెదపూడి మండలం అచ్చుతాపురత్రయం, పెదపూడి, జి.మామిడాడ గ్రామాలలో పర్యటించి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కొరకు సిద్దం చేసిన లేఅవుటులను, జగనన్న కాలనీలలో చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉన్నందున అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు.వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇంటి పట్టా మంజూరైన ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తిచేసే విధంగా అధికారులు చూడాలని కలెక్టర్ తెలిపారు.ముఖ్యంగా అధికారులు పెద్ద లే అవుటులపై దృష్టి సారించాలని, లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇసుక, సిమెంటు, స్టీల్ తదితర అన్ని సామాగ్రి, సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. వీటికి అదనంగా డీఆర్డీఏ నుంచి అర్హత కలిగిన లబ్ధిదారులకు రూ.35 వేలు ఇంటి నిర్మాణం నిమిత్తం రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. హౌసింగ్ ప్రోగ్రాంకి సంబంధించి గ్రౌండింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అధికారులు ఏపీత్రయం లేఅవుట్ లో నీటి సమస్య, పెదపూడిలో అప్రోచ్ రోడ్డు నిర్మాణం వంటి సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చారని, ఈ సమస్యల తక్షణ పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్ల కొరకు నిర్మిస్తున్న శాశ్వత భవనాలు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.జూన్ 30 నాటికి సచివాలయాలు, సెప్టెంబర్ 30 నాటికి రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లు నిర్మాణాలను జిల్లా అంతటా పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించడం జరిగిందన్నారు.గడచిన ఒక్క నెలలో సుమారుగా 200 పైన ప్రభుత్వ శాశ్వత భవనాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలులో అధికారులు ప్రత్యేక చొరవ చూపి నిర్దేశించిన గడువు ప్రకారం దశలవారీ పురోగతి సాధిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెదపూడి తహసిల్దార్ టి.సుభాష్, ఎంపీడీవో విజయ భాస్కర్, ఈవోపీఆర్డీ హరికృష్ణ రెడ్డి, హౌసింగ్ ఏఈ ఎం. సత్యనారాయణ రెడ్డి, ట్రాన్స్ కో ఏడీఈ టి.విష్ణుమూర్తి, ఎన్ఆర్జీఎస్ ఏపీవో కె. నాగమణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement