Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఆటో డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ : ( విశ్వం వాయిస్ న్యూస్ )

ఆటో డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ డిఎస్పి మురళి కృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. సర్పవరం జంక్షన్ లో గల యూనియన్ కార్యాలయంలో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపరాదు అన్నారు .ఇటీవల కొంతమంది డ్రైవర్లు మహిళను తీసుకునేటప్పుడు జరిగిన పరిణామాలు వివరించారు. ఒకరు తప్పు చేస్తే అది సంఘం లో అందరు మీదికి వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే సహించేది లేదన్నారు. దీనివల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతాయన్నారు. స్కూల్ పిల్లలను తీసుకుని వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రులు పడే బాధ అందరూ తెలుసుకోవాలి అన్నారు. అదేవిధంగా వాహనాల్లో ముందు సీట్లో కూర్చోబెట్టుకుని వెళ్లరాదని తెలిపారు. అనంతరం ట్రాఫిక్ సీఐ చైతన్య కృష్ణ మాట్లాడుతూ గతంలో వాహనం వెనకాల వైపు డ్రైవర్ పేరు బ్యాడ్జి నెంబరు రాసి ఉండేదని ఇప్పుడు ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ కాకి డ్రెస్ వేసుకోవాలని తెలిపారు . ముందు సీట్లో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తే చాలానా వేయడం జరుగుతుందన్నారు. మేము ప్రభుత్వం ఇచ్చిన డ్రస్సులు వేసుకుంటామని దానివల్ల గౌరవం కూడా పెరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement