Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

బీసీ కులాల గణన చేయకపోతే ఉద్యమం తీవ్రతరం.. చేస్తాం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ : విశ్వం వాయిస్ న్యూస్

బీసీ కులాల గణన చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని , అవసరమైతే ప్రత్యక్ష కార్యచరణకు సిద్ధమవుతామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం హెచ్చరించింది.సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు సోమవారం స్థానిక కాస్మో పాలిటన్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా విశ్వనాధపల్లి శ్రీనివాస రాజును నియమించామని నియామక పత్రం అందజేశారు.26జిల్లాలలో కార్యవర్గ నిర్మాణం చేపట్టామన్నారు. బీసీ వర్గాల భవిష్యత్ అంతా కుల గణాలపై ఆధారపడి వుందని , అందువల్ల ఉద్యమం తీవ్రతరం చేయకతప్పదన్నారు.

 

గతంలో కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలోని యుపిఎ ప్రభుత్వంలో కూడా కులాల గణన చేయాలని నిర్ణయించినా ఆచరణ నోచుకోలేదన్నారు . 2021 సంవత్సరంలో జరగబోయే జనాభా లెక్కల సేకరణలో భాగంగా వెనుకబడిన కులాల వివరాలు సేకరించాలనే డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ , తమిళనాడు , కేరళ , ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాలు బీసీ గణనకు ఆమోదం తెలుపుతున్నాయన్నారు . భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వాలెంటీర్ల వ్యవస్థ శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి బీసీ జనగణన చేసి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నామన్నారు.కార్యక్రమంలో పిల్లా శ్రీనివాస్ గౌడ్, యనమల రామం, మార్గాని చంద్ర కిరణ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు పితాని రాంబాబు, సంసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!