– ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారికి పాదరక్ష
ఎక్కడ ఉంది..
– ఎంతోమంది అధికారులు వస్తారు.. పోతారు
* సిబ్బంది మాత్రం లోకల్ *
– కొన్ని కార్యాలయాల్లో సిబ్బంది మార్పు కోసం స్థానిక
ప్రజలు ఎదురుచూపులు
– ఎన్ని ప్రభుత్వాలు మారిన సిబ్బంది ప్రక్షాళన జరగదా ?
– అవినీతి సిబ్బంది ప్రక్షాళన పై అనేక కథనాలు త్వరలో…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినా:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
దేవుడు వరమిచ్చినా పూజారి అనుమతివ్వని చందంగా… పెద్దలు పలికిన సామెతలను కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది నిజం చేస్తున్నారు.బదిలీలు అనే మాట ఉన్నతాధికారులకు వర్తిస్తుంది తప్ప,ఏళ్లతరబడి తిష్ట వేసిన కిందిస్థాయి సిబ్బందికి వర్తించడం లేదనేది అక్షర సత్యం.ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల్లో పాతుకుపోయిన కింద స్థాయి ఉద్యోగులను మాత్రం మార్చలేని పరిస్థితి.పేరుకు సీసీలు, గుమస్తాలు,కంప్యూటర్ ఆపరేటర్లు,ఇతర కింద స్థాయిలో కొలువులు.నిజానికి రాక్షస జాతికి చెందిన చేపలుగా బలిసి కొట్టుకుంటున్నారు అనేది ప్రజల ప్రధాన ఆరోపణ.ఈ చేపలు…అవినీతి నిరోధక శాఖ వలలో పడకుండా జాగ్రత్తలు పడుతున్నాయి.ఎక్కడ చూసినా పై స్థాయి అధికారులు పట్టుబడ్డారనే వార్తలు తప్ప, ఏళ్లతరబడి తిష్ట వేసిన కిందిస్థాయి సిబ్బంది మాత్రం చిక్కారనే వార్తలు చాలా తక్కువ అనేది జగమెరిగిన సత్యం.అయితే తతంగమంతా నడిపేది కింది స్థాయి అధికారులే… బలయ్యేది మాత్రం పై స్థాయి అధికారులు.పాపం పై స్థాయి అధికారులకు ఎన్నో నియమ,నిబంధనలు ఉద్యోగాన్ని కాపాడుకోవడానికే సరిపోతుంది.కానీ కింద స్థాయి ఉద్యోగులకు ఏ భయమూ బాధా లేకుండా విచ్చలవిడిగా అధికారులను అడ్డుపెట్టుకుని కోట్లు గడిస్తున్నారు.అవసరాల నిమిత్తం వెళ్లిన ప్రజలకు చుక్కలు చూపిస్తారు. విసుక్కుంటారు…. కసురుకుంటారు.. అధికారులను కలవాలంటే ముందు తమను చల్లబరచాలనీ.. లేకపోతే పని జరగదనీ.. బహిరంగంగానే చెప్పడం శోచనీయం.సిబ్బంది ప్రక్షాళన జరిగితేనే గాని ప్రభుత్వ కార్యాలయాలు బాగుపడవనీ..నిజాయితీగా పనిచేసే ఉద్యోగులను కూడా వీరు పాడు చేస్తున్నారనీ అనేక ఆరోపణలు గుప్పుమంటున్నాయి.ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలో.. ఏ ఫైల్స్ మీద సంతకం పెట్టకూడదో… ఫైలు ఎక్కడుందో … కార్యాలయం లావాదేవీలు మొత్తం వీరి కను సైగలలోనే జరుగుతున్నాయి.. ఒకవేళ బండారు బయటపడి బలవంతంగా బదిలీ జరిగినప్పటికీ కార్యాలయంలో కొన్ని కొన్ని పనులు జరగాలంటే వీరి మాటామంతీ తప్పనిసరిగా కావాలంటా! ప్రజలను ఏళ్లతరబడి జలగల్లా పట్టి రక్తం తాగుతున్నారు.అసలైన అవినీతి అక్రమార్కులు వీరే ? అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై,ప్రజల విజ్ఞప్తుల మేరకు కథనాలను ప్రచురిస్తూ సిబ్బంది పక్షాలనకు మా ఈ చిన్న ప్రయత్నం.