విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ :
మండలం లోని వెదురుపాక ఈ నెల 17తేదీన రాత్రి జరిగిన పోలేరమ్మ అమ్మవారి తీర్థంలో గ్రామానికి చెందిన బాలకృష్ణ, కుమార్, నాగన్న, దుర్గాప్రసాద్, సాయి, మరికొంతమంది తనను కొట్టి, కులం పేరుతో దూషించారని అదే గ్రామానికి చెందిన విప్పర్తి మురళి చేసిన ఫిర్యాదుపై రామచంద్రపురం డిఎస్పి డి. బాలచంద్రారెడ్డి వెదురుపాక లో మంగళవారం విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా బాధితుడు మురళి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘటనా స్థలంలో పలువురిని విచారించి వివరాలు సేకరించారు. డిఎస్పి వెంట రాయవరం ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ ,ఏఎస్ ఐ పెండ్యాల వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ రైటర్ రొక్కాల శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.