విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ : విశ్వం వాయిస్ న్యూస్
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సంధర్బంగా కాకినాడ ఐడిఎ ఆధ్వర్యాన పలు కార్యక్రమాలను చేపట్టారు.
కాకినాడ,జెఎన్ టియుకె ఎస్ఎస్ ఎస్ యూనిట్ కాకినాడ ఐడిఎ,లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ సంయుక్తంగా పొగాకు రహిత సమాజం అనే నినాదం తో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జెఎన్ టియు ప్రిన్సిపల్ కృష్ణప్రసాద్ విచ్చేసి ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు.ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ దుర్గాగంగారావు ఆధ్వర్యాన ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులతో జెఎన్ టియుకె నుంచి భానుగుడి వరకూ ర్యాలీ నిర్వహించారు.
భానుగుడిలో పొగాకు వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలపై ఎగ్జిబిషన్ నిర్వహించారు.