విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ : విశ్వం వాయిస్ న్యూస్
తమిళనాడు రాష్ట్రం కడలూరు నందు జరిగిన 41 వ జాతీయ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం, జల్లూరు గ్రామం కు చెందిన యాతం నాగబాబు 200, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెం నందు వ్యక్తిగత విభాగాల నందు పాల్గొని మూడవ స్థానం లో నిలిచి నాలుగు కాంస్య పతకములు మరియు రిలే పరుగుపందెం నందు రెండు రజిత పతకాలు సాధించారు.
ఆయన ప్రస్తుతం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా మలేరియా విభాగం కాకినాడ జిల్లా నందు కాకినాడ సబ్ యూనిట్ అధికారిగా పని చేస్తున్నారు.2013 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు జరిగిన వివిధ జాతీయ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ నందు 200, 400, 1500 మీటర్లు పరుగుపందెం నందు వివిధ విభాగాల్లో నందు పాల్గొని 2022 వరకు మొత్తం 52 పథకాలు సాధించారని అందులో 12 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 24 కాంస్య పతకాలు సాధించారు.2023 సంవత్సరం ఫిబ్రవరి నెలలో బొంబాయి నందు జరుగు అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ నకు కూడా నాగబాబు ఎంపికయ్యారని అన్నారు.ఈ సందర్భంగా యాతం నాగబాబు ను కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత అభినందించి మాట్లాడుతూ నాగబాబు ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొని దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని
అన్నారు.వీరికి భార్య వెంకట ఆదిలక్ష్మి, ఇద్దరు కుమారులు సూర్య కిరణ్, నాగ చక్ర మణికంఠ అని అన్నారు.