విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట పట్టణ0(విశ్వ0 వాయిస్)
చెందిన శ్రీమతి కె. వి. ఛాయాదేవి (54) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మండపేట ఎమ్ ఎల్ ఏ వేగుళ్ళ జోగేశ్వరరావు వారి ఇంటికి వెళ్లి వారి భర్త అయిన ప్రముఖ న్యాయవాది కె.ఆర్.సి. నారాయణ రెడ్డిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఆమె ఏజిపిగా ఆలమూరు న్యాయస్థానంలో పనిచేశారు. ఆమె మృతి న్యాయవాద లోకానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేసారు. అలాగే ఇటీవల మృతి చెందిన ఏడిద గ్రామంలో చిట్టూరి నాగవర ప్రసాద్ గారి తల్లి గారు, అలాగే అర్తమూరు గ్రామంలో సత్తి సురాయమ్మ గారు మరణించగా ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేసారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ , మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, జొన్నపల్లి సూర్యారావు, కురసాల సత్యనారాయణ, పాలచర్ల రాంబాబు, కోలుపోటి సత్యనారాయణ, గొడవర్తి భాస్కరరావు, చిలుకూరి కృష్ణ, పదం ఆనంద్, బలుసు శ్రీనివాస్, ముగ్గళ్ళ సత్తిబాబు, శ్రీమతి విత్తనాల వాణి శ్రీదేవి, ఉడత గోవిందు, గుడాలకోట బాబు తదితరులు పాల్గొన్నారు.