Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

దళితుల అవసరతలు కోసం స్థలాన్ని కేటాయించారు…!

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ప్రభుత్వ భూమిని ఆక్రమించిన గిరిజనులను ఖాళీ
చేయించాలి
– స్థానిక తాసిల్దార్ వెంకటేశ్వర్లుకు పత్రికాముఖంగా
వినతి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

 

ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :

మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడిసెలు వేసిన గిరిజనులపై తక్షణమే విచారణ జరిపించి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి దళితుల అవసరతలు కోసం స్థలాన్ని కేటాయించాలని గ్రామదళితులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పత్రికా ప్రకటన ద్వారా వారు వివరాలు వెల్లడించారు. లక్ష్మీపురం గ్రామ దళితులు మాట్లాడుతూ గత 50 ఏండ్లుగా తమ తాతల కాలం నుండి ఖాళీగా వున్న సర్వే నంబర్ 46లో గల 3.50 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ఉపయోగం కోసం ఆట స్ధలంగానూ , స్మశాన వాటికగా , ఇతరత్రా కార్యక్రమాల కోసం తామంతా కేటాయించుకున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇటీవల లక్ష్మీపురం గ్రామంలోని కొంత మంది గిరిజనులు , వేరే గ్రామానికి చెందిన గిరిజనులు కలసి దౌర్జన్యంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోని గుడిసెలు , ఇండ్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. గుడిసెలు వేసిన గిరిజనులకు పక్కా గృహాలు , 5 నుండి 10ఎకరాల వ్యవసాయ భూమి మరియు పోడు భూమి పట్టాలు సైతం కలిగి ఉన్నారని ఇందులో నిరుపేద కుటుంబాలకు చెందిన గిరిజనులు ఎవరూ లేరని తెలిపారు. ఇట్టి విషయంపై స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దాంతో తహశీల్దార్ వెంకటేశ్వర్లు స్పందించి ప్రభుత్వ భూమిలో బోర్డ్ పాతించినట్టు తెలిపారు. స్థలాన్ని ఆక్రమించి గుడిసెలు వేసిన గిరిజనులను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించగా , గిరిజనులు తహశీల్దార్ అదేశాలను సైతం లెక్క చేయకుండా నేటి వరకూ స్థలాన్ని ఖాళీ చేయలేదన్నారు. ఇట్టి విషయంపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తక్షణమే స్థలాన్ని ఖాళీ చేయించాలని లక్ష్మీపురం దళితుల అవసరతలు కోసం స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు. ప్రకటన చేసిన వారిలో ఉప సర్పంచ్ పి.అరుణ , రంగయ్య , రాములు , బాబు , పిచ్చమ్మ , బ్రహ్మం , కాంతారావు , ప్రదీప్ , అశోక్ , సతీష్ , వెంకన్న , రమాదేవి , ప్రకాష్ , నర్సయ్య , రాహేలు , నర్సయ్య , కోటయ్య , భూపతిరావు , సుకన్య , గంగాభవాని , సాయమ్మ , ముత్తమ్మ , నాగమణి , విజయ్ భాస్కర్ , గురుస్వామి , భాగ్యమ్మ , కొండబాబు , వెంకటరమణ తదితరులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement