విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )
కోరుమిల్లి గ్రామ సచివాలయం లో రామచంద్రపురం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వారిచే ఆపరేషన్ పరివర్తన పేరుతో అక్రమ మధ్యం, నాటు సారాయి నిర్మూల పై అవగాహన కల్పించారు. స్థానిక సర్పంచ్ ఆచంట సత్య నారాయణ అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో ఎక్సైజ్ సీ. ఐ. సి హెచ్. వి. రామకృష్ణ నాటు సారా తాగితే కలిగే అనారోగ్య సమస్యలు పై వివరించారు. అలాగే నాటు సారా విక్రేతలు, తయారీ దారులు పట్టుబడితే విధించే శిక్షలు కఠిన0గా వుంటాయని సి ఐ రామకృష్ణ హెచ్చరించారు.అనంతరం నాటు సారా రహిత గ్రామంగా కోరుమిల్లి గ్రామం వుండేలా ప్రతిఒక్కరూ కంకణ బద్దులు కావాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్ష,కార్యదర్శులు ఆచంట వీరా స్వామి, సుంకర మూలా స్వామి, పంచాయితీ వార్డు సభ్యులు వెలుగుభంటి యేసు దాసు, సుంకర మణికంఠ, ఎక్సైజ్ ఎస్. ఐ. రవి కుమార్, హెచ్. సి. ప్రసాద్, ఈ. సీ.ధనుష్, గ్రామ వాలంటీర్లు , మహిళా పోలీస్, సచివాల సిబ్బంది,అంగన్వాడీ కార్యకర్తలు,పాల్గొన్నారు.