Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సృజనాత్మకతను వెలికితీస్తుంది వేసవి వినోదం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్:

జగన్నాధ పురం ఎంఎస్ ఎన్ చారిటీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల యందు పాఠశాల విద్యాశాఖ మరియు వి బి వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి వినోదం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి 24 పాఠశాల నుండి 113 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్ ఎస్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యార్థులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే ఇలాంటి కార్యక్రమాలు సహకరిస్తాయి. విద్యార్ధులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, విజ్ఞానంతో పాటు వినోదం అందించేది ఈ వేసవి వినోదం అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సైన్స్ ఆఫీసర్ యం శ్రీనివాస వినీల్ మాట్లాడుతూ సైన్స్, వినోదం, విజ్ఞానం ఆడుతూ పాడుతూ నేర్పేది వేసవి వినోదం. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీస్తుంది వేసవి వినోదం. పాఠశాల విద్యాశాఖ మరియు వి బి వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కు అభినందనలు తెలిపారు. విద్యార్ధులు క్రమశిక్షణతో వినోదం విజ్ఞానం పొందాలి అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన బాలవేదిక కన్వీనర్ నోరి బలరామకృష్ణ తన హాస్య గుళికలతో విద్యార్ధులకు వినోదాన్ని విజ్ఞానాన్ని చిన్న చిన్న బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో యంయస్ యన్ చారిటీస్ తెలుగు ఉపాధ్యాయులు యం వి యస్ రామకృష్ణ మాట్లాడుతూ భాషను ఆటపాటలతో నేర్చుకోవాలి. పద్యాలు,గీతాలు, కధలు, కవితలు వంటి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కేసరి శ్రీనివాస రావు,సత్యలక్ష్మి, రమేష్ కుమార్, మస్తాన్, యం.దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement