విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
49 వ వార్డు లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కురసాల.
కాకినాడ : ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా
పనుల్లో నాణ్యత ఖచ్చితంగా ఉండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు.పలు అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 49 వ డివిజనులో పలు అభివృద్ధి పనులను శాసనసభ్యులు కన్నబాబు, మేయర్ సుంకర శివ ప్రసన్న, అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ కార్పొరేటర్ పాలిక ఉషారాణి సూర్యప్రకాశరావు తో కలిసి పర్యటించడం జరిగింది. 49 వ డివిజన్ లోని రాజేశ్వరి నగర్ లో కమ్యూనిటీ భవనం, సోమాలమ్మ గుడి వీధిలో బీసీ కమ్యూనిటీ భవనం, రోడ్లు,డ్రైన్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రామ్ నగర్ నాలుగో వీధిలో నిర్మిస్తున్న డ్రైన్లకు నాణ్యతాప్రమాణాలు లేవని వెంటనే బిల్లును ఆపాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలోగల 49 వ డివిజనులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని రోడ్లు డ్రైన్లు, కమ్యూనిటీ భవనాలు,పార్కులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. క్వాలిటీ తగ్గించి పనులు చేస్తే ఉపేక్షించేది లేదని వెంటనే వారిపై చర్యలు తీసుకోవడం, బిల్లును ఆపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జి,జడ్పిటిసిలు , నురు కుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, కార్పొరేటర్ వెంకటలక్ష్మి కృష్ణ, వైకాపా రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, వైయస్ఆర్ సీపీ నాయకులు కడియాల చిన్న,పాలిక రమణ, మార్కెట్ డైరెక్టర్లు మేడిశెట్టి లక్ష్మి, వరుసల జాన్ ప్రభాకర్ వైయస్సార్ రాజు, కొల్లు బోయిన భవాని, ప్రభుత్వ అధికారులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ముందుగా 49 వార్డులో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి ఆధ్వర్యంలో వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.