విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:
కరప ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ రూరల్: కడప జిల్లా నుండి వచ్చిన సన్యాసి (75) సుమారు ఐదు ఆరు సంవత్సరాల క్రితం వేలంగి గ్రామానికి వచ్చి అక్కడ గ్రామంలో ఉండే ప్రత్తిపాటి రుక్మిణమ్మకు, నా చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయానని తన జీవిత కథను చెప్పాడు ఆమె ఆ సన్యాసి కి నివసించేందుకు మార్కెట్ సెంటర్ వద్ద ఒక పెంకుటిల్లు సమకూర్చారు, అలా ఆ ఇంట్లో నివసిస్తూ గ్రామం చుట్టుపక్కల నుండి వచ్చేవారికి రక్షరేకులు కడుతూ, భిక్షాటన చేసి, అలా వచ్చే సొమ్ములను దాచుకుంటూ జీవిస్తున్నాడు, విషయంలోకి వెళ్తే వడ దెబ్బ తగిలిందో అనారోగ్యము తోనో గురువారం హటాత్తుగా చనిపోయాడు అక్కడ ఉండే స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి తెలియపరిచారు ఎస్ఐ డి రమేష్ బాబు అక్కడికి చేరునుకున్నారు మృతదేహాన్ని పరిశీలించారు అక్కడ కొన్ని మూటలు కనబడ్డాయి అక్కడ ఉన్న మధ్యవర్తుల సమక్షంలో వాటిని తెరిచారు నోట్ల కట్టలు చిల్లర నాణేలు కనిపించాయి వీఆర్వోలు సత్యవతి, భీమశంకరం, మహిళా పోలీస్ దుర్గ భవాని, వారి సమక్షంలో ఎస్ఐ డి రమేష్ బాబు కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది