విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అముజూరు:
కె. గంగవరం మండలం (విశ్వం వాయిస్)
అముజూరు గ్రామంలో అల్లూరి కృష్ణా రావు గారి స్థలంలోపాస్టర్ ఎమ్. జాన్ బాబు, శ్రీమతి విజయ గారి ఆధ్వర్యంలో యేసయ్య రక్షణ మహోత్సవాలు మూడు రోజులు పాటు ఘనంగా జరిగాయి. పాస్టర్ సుందర సింగ్ వారి సంగీత కల్పనలో క్రీస్తు గీతాలు మన్నా యూత్ వారు ఆలపించారు. ముక్ష్య ప్రసంగీకులు మంగళంపల్లి సుబ్బారావు, బెడవాడ ఆశాపు గారు, జోజెఫ్ గారులు ఈ మూడు రోజులూ జీవిత సాక్ష్యం వాఖ్యసందేశం చేశారు. వారు ముగ్గురూ చేసిన వాఖ్య సందేశం స0ఘ విశ్వాసులు శ్రద్ధగా విన్నారు.ఈ క్రీస్తు రక్షణ మహోత్సవాలు కు పామర్రు, పాని0గిపల్లి, కూళ్ళ, సత్యవాడ, కే.గంగవరం, టేకి, యండగ0డి, కాలేరు,తదితర గ్రామాల నుండి దైవ సేవకులు, విశ్వాసులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు, ఈ యేసయ్య రక్షణ మహోత్సవాలు కు వచ్చిన వారికి భోజన వసతులు కల్పించారు.