విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
సోషల్ మీడియా లో సున్నితమైన అంశాలు , ఇతరుల మనోభావలని తెబ్బతీసేటటువంటివి . రెచ్చ గొట్టేవి , ఒక వ్యక్తిని , ఒక వర్గాన్ని , ఒక ప్రాంతాన్ని , దేశ నాయకులను కించ పరిచే , అవమాన పరిచేటటువంటి వీడియోలను , మెస్సేజ్ లను , స్టేటస్ లను వాట్సాప్ గ్రూప్ల లో , సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేసినట్లయితే , సర్క్యూలేట్ చేసిన వ్యక్తి మరియు ఆ గ్రూప్ అడ్మిన్ ల మీద కూడా చట్ట పరమైన చర్య తీసుకొనబడును . కేసు రిజిస్టర్ అయిన తరువాత వారు ఎటువంటి గవర్నమెంట్ మరియు పోలీస్ వెరిఫికేషన్ చేసే ప్రైవేట్ జాబ్స్ కి అనర్హులు అవుతారు మరియు వారు విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ కూడ రాదు వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది . పై విషయాలను ప్రజలందరూ గమనించాలి ఎవరైనా ఇటువంటి వీడియోలు , మెసేజ్ లు , స్టేటస్ లు పెట్టిన యెడల పోలీస్ వారు దృష్టి కి తీసుకురావలెను అలా కాకుండా పోస్ట్లు పెట్టినవారి ఇంటికి వెళ్లి వారిని నిర్బంధించడం , కొట్టడం లాంటి కార్యక్రమాలు చేసిన యెడల వారు కూడా చట్టప్రకారం శిక్షార్హులు అవుతారు అని రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ తెలిపారు…