విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ, జూన్ 2; సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం 6 వ రోజైన గురువారం కూడా కొనసాగింది.
సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబి రాణి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యమాలు పోరాటాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా సిఐటియు శక్తి మేరకు కృషి చేస్తోందన్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ వారు గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించారని పేర్కొన్నారు.
ప్రజలు, వాహనదారులు పెద్ద సంఖ్యలో సిఐటియు శిబిరం వద్దకు వచ్చి మజ్జిగ స్వీకరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ, నగర కార్యదర్శి భారతి, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. చంద్రావతి లతో పాటు సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకట రమణ, పలివెల వీరబాబు మరియు రాణి, సత్యానందం తదితరులు పాల్గొన్నారు…