విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట విశ్వం వాయిస్ న్యూస్
మండపేట: పేదల సంక్షేమం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, 22వ వార్డు కౌన్సిలర్ బొక్కా సరస్వతి, వైసీపీ నాయకులతో కలిసి తోట త్రిమూర్తులు 22వ వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాజబాబు, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ళ నారాయ్య బాబు, పట్టణ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, ఎంపీపీ ఉండమట్ల వాసు, ఏడిది సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, జడ్పిటిసి అబ్బు, రూరల్ కన్వీనర్ పిల్ల వీరబాబు, వల్లూరి రామకృష్ణ, వార్డ్ ఇంచార్జ్ అన్యం ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, వైసిపి కార్యకర్తలు, తోట అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.