విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
నగర ప్రజలకు సరఫరా అవుతున్న కలుషిత త్రాగు నీరు పై తగు చర్యలు చేపట్టాలని కోరుతుా సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు శుక్రవారం నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె.రమేష్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నగరంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్పోరేషన్ సంబంధించి నటువంటి త్రాగునీటి పైప్ లైన్ ల ద్వారా నగర ప్రజలకు కలుషిత త్రాగు నీరు సరఫరా జరుగుతున్నది. ఈ కలుషితమైన నీరు త్రాగడం వలన నగర ప్రజలు ఆనేక అనారోగ్యాలకు గురౌవడమే కాకుండా పలు డివిజన్లలో ఈ కలుషితమైన నీరు త్రాగడం వల్ల డయేరియా కేసులు కుాడా నమోదు అవడం జరిగిందని, ఆయినా అధికారులలో ఎటువంటి చలనం లేదని, ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు త్వరితగతిన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రతి డివిజన్ నందు తాగునీటి సరఫరా పైపులైన్ లను తనిఖీలు నిర్వహించి నగర ప్రజలకు స్వఛమైన త్రాగు నీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మలిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమి బాల కామేశ్వరరావు, పలివెల రవి అనంతకుమార్, బంగారు సత్యనారాయణ, గుజ్జు బాబు, తదితరులు పాల్గొన్నారు.