Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పరిశ్రమ యజమానులు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి.. ఎమ్మెల్సీ తోట

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

మండపేట పట్టణం (విశ్వం వాయిస్ )

ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించుటకు,ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యం తోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారని మండపేట వైసీపీ ఇంఛార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శుక్రవారం సాయంత్రం మండపేట పట్టణం 22 వ, వార్డులో స్థానిక కౌన్సిలర్ బొక్క సరస్వతి,అదికారులు, అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు, తోట అభిమానులు వెంటరాగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసు కున్నారు. తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకుని వచ్చిన ప్రజా, వ్యక్తిగత అవసరాలు వెంటవున్న అదికారులు, ప్రజా ప్రతినిధులు తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశి0చారు. మండపేట పట్టణం లో పరిశ్రమ యజమానులు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని తోట త్రిమూర్తులు సూచనలు చేశారు. గడప గడపకు తిరుగుతున్న ఎమ్ ఎల్ సీ తోట కు అడుగు అడుగునా పుర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూకదుర్గా రాణి, జెడ్పీటీసీ కుడుపూడి భవాని,వైసీపీ నాయకులు వేగుళ్ళ పట్టాభి రామయ్య, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధ కృష్ణ, స్థానిక ఎంపీపీ ఉ0 డమట్ల శ్రీను వాసు, చైర్మన్ పిల్లి గణేష్, కౌన్సిలర్ సీతా మహాలక్ష్మి, విప్ పోతంశెట్టి ప్రసాద్, వైసీపీ అర్బన్, రూరల్ కన్వీనర్ల ముమ్మిడివరపుబాపిరాజు, పిల్లా వీర బాబు, వైసీపీ నాయకులు పలివెల సుధాకర్, వల్లూరి రామకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ సూరంపూడి సత్య ప్రసాద్, రాయవరం మాజీ ఎంపీపీ సిరివరపుశ్రీనివాస్,ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, మారేడు బాక సర్పంచ్ గోవిందు రాజు, కపిలేశ్వరపురం జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు, పలివెల మధు,మేడిశెట్టి దుర్గారావు, నక్కా సింహాచలం, సలాధి అప్పారావు, వంగా నల్ల శ్రీను, పాల0గి శ్రీను, మేడిశెట్టి గోవిందు, సలాధి వీరబాబు,సచివాలయం సిబ్బంది, అధికార్లు,పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement