విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:
పెనుమంట్ర (విశ్వంవాయిస్ ప్రతినిధి)
బాధ్యతగా విధులను నిర్వహించి ఆదర్శ సచివాలయంగా పేరు తేవాలనీ జిల్లా కలెక్టర్ ప్రశాంతి కోరారు.పెనుమంట్ర మండలం మార్టేరు-1 సచివాలయంను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్బంగా సచివాలయంలో వివిధ పథకాలకు సంబంధించి ప్రదర్శించిన అర్హుల జాబితాను పరిశీలించారు.వివిధ పథకాల లబ్ధిదారులకు ఇకేవైసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అమ్మఒడికి అర్హులైన జాబితాలను సిద్ధంగా ఉంచాలన్నారు.ఇళ్ల నిర్మాణం ప్రగతి తక్కువగా ఉందని లబ్ధిదారులను ప్రోత్సహించి నిర్మాణాలు చేసుకునేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని శానిటరీ సెక్రటరీకి సూచించారు. సచివాలయాల పరిధిలో మాతా శిశు మరణాలు గురించి ఎఎన్ఎం కలెక్టరు వాకబు చేశారు. సేఫ్ డెలివరీ క్యాలండరును పరిశీలించారు. లాంగ్ పెండింగు సమస్యల పరిష్కారం గురించి వి.ఆర్.వోను అడిగి తెలుసుకుని సంబంధిత రిజిష్టర్లను ఆమె పరిశీలించారు. పించన్ల పంపిణీ రిజిష్టరును పరిశీలించి నూరు శాతం పంపిణీ అయ్యేలా చూడాలన్నారు. పింఛన్లు కొరకు అందిన దరఖాస్తులను వైయస్సార్ పింఛన్ యాప్ లో నమోదు చేయాలని వాలంటీర్లకు కలెక్టర్ సూచించారు.కలెక్టర్ పర్యటనలో తహసిల్దార్ డి.వి.ఎస్.ఎస్ అశోక్ వర్మ,ఎంపీడీవో డి.రాంబాబు,ఈ.ఓ.పి.ఆర్ డి.శ్రీనివాసరావు, పంచాయితీ సర్పంచ్ మట్టా కుమారిరాము,కార్యదర్శి నాగబాబు,సచివాయ సిబ్బంది, తదితరులు వున్నారు.