విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కడియం:
కడియం విశ్వం వాయిస్ న్యూస్
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలను టాటా గ్రూప్ సంస్థ చైర్మన్ రతన్ టాటా ప్రశంసలు అందించారు.కడియం గౌతమీ నర్సరీ అధినేత మార్గం వీరబాబు కుటుంబ సభ్యులు ముంబైలోని రతన్ టాటా స్వగృహంలో కలిశారు. మఈ సందర్భంగా కడియం నర్సరీల విశిష్టతను ఆయనకు వివరించారు.అప్పటికే ఈ నర్సరీల గురించి తెలుసుకున్న ఆయన మరింత ఆశ్చర్యం వ్యక్తం చేసారు.నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేస్తూ విశ్వవ్యాప్తంగా కడియం రైతులు గుర్తింపు పొందడాన్ని ఆయన అభినందించారు. అలాగే వీరబాబు తనయుడు శేషు ఇక్కడ మొక్కల ప్రత్యేకతలను రతన్ టాటా కు వివరించారు.ఆయన ఆతిథ్యాన్ని వీరబాబు, సత్య దంపతులు స్వీకరించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా విశేష గుర్తింపు పొందిన రతన్ టాటా కలవడం ఎంతో ఆనందంగా ఉందని వీరబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.