Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,169,711
Total recovered
Updated on April 1, 2023 12:15 AM

ACTIVE

India
15,208
Total active cases
Updated on April 1, 2023 12:15 AM

DEATHS

India
530,867
Total deaths
Updated on April 1, 2023 12:15 AM

ప్రజలకు నవరత్నాలతో పాటు.. కరెంటు కోత. దోమల మోత..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– వేలాపాల లేని కరెంటు కోతలు… అవస్థలు పడుతున్న
ప్రజలు
– రోజుకు 15 లక్షల యూనిట్లుకు పెరిగిన వినియోగం
– అందుబాటులో లేని విద్యుత్ సిబ్బంది

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )

– రోజుకు 15 లక్షల యూనిట్లుకు పెరిగిన వినియోగంన విద్యు ,విశ్వం వాయిస్:

గృహ అవసరాలకు నిరంతరం (24 గంటలు) విద్యుత్ సరఫరా ఇస్తున్నామని ప్రభుత్వ పాలకులు గొప్పలు చెబుతున్నారు. అయితే కాకినాడ పరిసర ప్రాంతాల్లో రోజుకు గంటల తరబడి, మధ్య మధ్యలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. పల్లెల్లో అయితే కరెంట్ పోతే ఎన్ని గంటలకు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అనధికార కోతలతో వినియోగదారులు నానా ఇబ్బందులుపడుతున్నారు.

గత రెండు వారాలుగా పెరిగిన ఎండలు చూస్తే మళ్లీ రెండో ఎండాకాలం వచ్చినట్లుగా ఉంది. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు పైగా నమోదవుతుంది.

దీనికి తోడు జిల్లాలో ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంట్ పోతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారంతెలుసుకుందామన్న అధికారుల నుంచి స్పందన కరువుతుందనివాపోతున్నారు. శనివారం నుండి విద్యుత్ కోతలు మొదలు కావడం జరిగింది. ఎప్పుడు ఇస్తారో. ఎప్పుడూ తీసేస్తారో అర్థం కాని పరిస్థితి. గ్రామీణం లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఉదయం, మధ్యాహ్నం , రాత్రి వేళల్లో కరెంట్ తిసేస్తున్నారు. గ్రామీణ లోని పలు ప్రాంతాల్లో రోజు మొత్తంలో 4,5 గంటలు మాత్రమే సరఫరా ఉంటుంది

 

*కరెంట్ కోత ఉక్కపోత..*

అసలే వేసవి కాలం. ఆపై కరెంట్ కోతలు. రెండూ కలిసి ప్రజలకు ఉక్కపోత. ఇదీ కాకినాడ రూరల్ నియోజకవర్గ దుస్థితి. శనివారం ఏకంగా 10 గంటలు విద్యుత్ కోత విధించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోజురోజుకూ విద్యుత్ కోతలు పెరుగుతున్నాయి. పాలకులు, అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ప్రతి వేసవిలో ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. అధికార, అనధికార కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. పల్లెల్లో పగలంతా కరెంట్ ఉండటం లేదు. కరెంట్ కోతలపై అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో జనం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలియదు కాని కాకినాడ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా అంధకారం నెలకొంది. శనివారం రోజున రాత్రి 8 గంటలకు తీసిన కరెంట్ 1 గంటలకు ఇచ్చారు. గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందా అని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

వేళా పాళా లేని విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మండల కేంద్రాలు, పట్టణాల్లో కరెంట్‌పై ఆధారపడి జీవిస్తున్న చిరు వ్యాపారులు కుదేలవుతున్నారు. వేసవి ప్రారంభం నుండి ఈ రకంగా ఎడా పెడా విద్యుత్ కోతలను విధిస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణాల్లో అధికారికంగా గంట, అనధికారికంగా మరో గంట కోత విధిస్తున్నారు. గ్రామాల్లో అయితే పగలంతా కరెంట్ ఉండటం లేదు. పల్లెల్లో ప్రజలకు కంటిపై కునుకు లేకుండాపోతోంది.

ఈ కోతల వల్ల తాగునీటి పథకాలకు ఆటంకం ఏర్పడుతున్నది. మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో మోటార్ల ద్వారా నీటిని తోడేందుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. మరోవైపు ఏసీల వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు.

జెరాక్సు షాపులు, జ్యూస్ ఈసెంటర్లు, పిండి మిల్లులు, వెల్డింగ్ షాపులు, పట్టణంలో ని వర్క్‌షాపుల్లో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. పనులపై వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి ట్యాంకుల నుంచి తాగునీరు సరఫరా లేక ప్రజలు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!