Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అందరూ చదవాలి- సమాజంలో అందరూ ఎదగాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విద్యా వ్యవస్థను రాజకీయం చేయడం తగదు
కుసుమ శివ శంకర్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

రాజకీయాలు చేయటానికి పదో తరగతి ఫలితాలను కూడా ఉపయోగించుకోవడం దిగజారిపోయిన రాజకీయాలకు పరాకాస్ట

అని అంబాజీపేట మండలం మాచవరం గ్రామనికి చెందిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు, సామాజిక సంఘ సేవ నాయకులు కుసుమ శివ శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఇంత సంకుచితంగా వ్యవహరించడం వలన విద్యా ప్రమాణాలు మరింతగా పడిపోవడానికి కారణం అవుతాయని అన్నారు. మొన్న తెలంగాణ లో కూడా ఇలానే జరిగింది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే ఫెయిల్ అయిన విద్యార్థులు అందరినీ పాస్ చేసేసారు. ఈ మాత్రం దానికి పరీక్షలు పెట్టడం దేనికి. పరీక్షల నిర్వహణా విభాగం అనే వ్యవస్థ ఎందుకు. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో ఈరాజకీయ పార్టీలకు తెలుసా….పాస్ అయినట్టు సర్టిఫికెట్లు ఇవ్వడం అంటే పార్టీ టికెట్స్ ఇవ్వడం అనే దిగజారుడు ఆలోచన తో ఉంటే ఎలా. స్కూల్ కి కాలేజ్ కి క్లాసు లకు అటెండ్ అవుతున్న విద్యార్థులు కష్టపడి చదవాలి,క్లాసులో పాఠాలు వినాలి. ఉపాధ్యాయులతో పాటు తల్లితండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి.

విద్యార్థులు చదువు పై శ్రద్ద లేకుండా వేరే ఇతర వ్యాపకాలకు లోనై చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉపాధ్యాయుల మాట ,తల్లిదండ్రుల మాట వినని విద్యార్థులు చదువు కి ప్రాధాన్యత ఇవ్వని విద్యార్థులు ఫెయిల్ అవుతారు..టాలెంట్ ఉన్న వాళ్ళు, కష్టపడి చదివిన వాళ్ళు కచ్చితంగా పాస్ అవుతారు. విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించడానికే పరీక్షలు పెడతారు. అలా కాకుండా తక్కువ మంది పాస్ అయ్యారని ఫెయిల్ అయిన వాళ్ళు అందరినీ పాస్ చేయాలని గొడవ చేయడం చదువు పట్ల బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవరించే విద్యార్థులకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు గా ఉండటమే కాకుండా పరీక్షల్లోఫెయిల్ అయితే మాకు కొన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటాయి అనే స్థితికి విద్యార్థులను తీసుకువచే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు…అందరునీ పాస్ చేసేస్తే చడవరం ఎందుకు, పరీక్షలు పెట్టడం ఎందుకు..ఇప్పటికే విద్యా వ్యవస్థ విలువలు కోల్పోయి వ్యాపార వస్తువు గా మారిపోయింది. . కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేసేసారు. డబ్బు ఉన్న వాళ్ళకే, లక్షలు ఫీజులు కట్టిన వాళ్ళకే ర్యాంకులు,మార్కులు అన్నట్టుగా చేశారు విద్యా వ్యవస్థను..

ప్రతిపక్షాలు మీకు చేతనైతే విద్యా వ్యవస్థ ను ఎలా సంస్కరించాలి అనే విషయంలో ఏమైనా అవగాహన,విద్యా విషయ పరిజ్ఞానం ఉంటే ఆ దిశగా మాట్లాడండి. ప్రతిపక్షాలు అని అనదంలో అర్థం నేను అధికార పార్టీ కి సపోర్ట్ కాదు. జనసేన టీడీపీ లు విద్యార్థులు ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని ఆందోళన చేయడం ఏమాత్రం పరిపక్వత బాధ్యత కలిగిన విధానం కాదు.

ఒక లెక్చరర్ గా చెప్తున్నా…ఫెయిల్ అయిన విద్యార్థులు వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం బాగా చదవకపోవడం.ఫెయిల్ అయిన వారికోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు… గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుని ఎక్కడ లోపాలు ఉన్నాయో అర్థం చేసుకుని బాగా చదివి రాస్తే పాస్ అవుతారు. తగినంత పరిజ్ఞానం లేకుండా అందరినీ పాస్ చేసేస్తే డిగ్రీ కి వచ్చినా ఇంజినీరింగ్ కి వచ్చినా ఆ కోర్సులు చడవలేక ఆ సబ్జెక్స్ అర్థం చేసుకోలేక ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేయలేకపోతున్న విద్యార్థులు వందల మంది ఉంటున్నారు. కనీస ఆంగ్ల పరిజ్ఞానం టెక్నికల్ సబ్జెక్ట్స్ లో నాలెడ్జి లేక అన్ని సెమిస్టర్స్ లొ ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు.

ఈ పరిస్థితి ఏర్పడకూడదు అనుకుంటే పరీక్షల నిర్వహణ, ప్రశ్న పత్రాల వాల్యుయేషన్ చాలా కటి

కఠినంగా ఉండాలి..

డబ్బులు పెట్టి వస్తువు కొంటున్నట్టుగా గా ప్రైవేట్ స్కూల్, కాలేజ్ యాజమాన్యాలు ఫీలుజు కడుతున్నారు కదా అని బాగా చదవని, చదువు అంటే చాలా నిర్లక్ష్యం గా ఉంటే విద్యార్థులను కూడా పరీక్షలలో కాఫీ చేయించి స్లిప్పలు ఇచ్చి పాస్ చేయిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు ఉంది.

తల్లితండ్రులు కూడా వేల రూపాయలు ఫీజులు కట్టినా మా పిల్లలు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అడుగుతున్నారు తప్ప వాళ్ళ పిల్లలు ఎలా ప్రవరిస్తున్నారు… ఎలా చదువుతున్నారు… అసలు చదువుతున్నారా లేక వేరే వ్యాపకాలకు లోనై పోయారా అని చాలా మంది పేరెంట్స్ పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు.

వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రాజకీయ పార్టీలు ఆందోళన చేయడం బాధ్యత విద్యా వ్యవస్థ పట్ల అవగాహన లేమికి అద్దం పడుతోంది.. అలాగే ఎదో ఒకటి చేసి మీడియా లో కనపడాలనే చకబారు ఆలోచనలు వ్యవస్థ పతనావస్థకు దారితీస్తాయని గ్రహించాలి అని ఆ లేఖలో కుసుమ శంకర్ పేర్కొన్నారు. సంఘంలో సమాజంలో అందరూ అందరూ ఎదగాలి చిన్ననాటి నుంచి ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాల వైపు ఆలోచించే దిశగా పయనించాలని .. అలాగే చిన్ననాటినుండి చెడుఅలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలని ఆలేఖలో తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో చదివి పాస్ అవ్వాలని కుసుమ శివశంకర్ ఆకాంక్షించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement