Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సత్వరం ఇళ్లను నిర్మించండి… తాసిల్దార్ విజ్ఞప్తి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* కోర్టు కేసుల చిక్కుముడి వీడింది
* ప్రైవేట్ బ్యాంకులు ప్రాణంతో సిద్ధం
* మిగతా వారికి సీతయ్యమ్మపేట స్థలాలు ఇస్తాం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, జూన్ 8, (విశ్వం వాయిస్ న్యూస్) ;

కోర్టు కేసుల చిక్కుముడి వీడింది… గృహ నిర్మాణాలకు రుణం ఇవ్వడానికి ప్రైవేట్ బ్యాంకులు కూడా సిద్దంగా ఉన్నాయి … ముందుగా నిర్ణయించినంత మందికీ ఇళ్ళ స్థలాలు చాలనందున మిగిలిన వారు అందరికీ వేగిరం సీతయ్యమ్మపేటలో స్థలాలు ఇస్తాం… సత్వరం ఇళ్ళను నిర్మించండి … ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చండి అని తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేసారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో స్థానిక పంచాయితీ కార్యాలయంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల పట్టాలను బుధవారం పంపిణీ చేసారు. పంచాయితీ లోని 280 మంది మహిళా లబ్దిదారులకు మంజూరు అవ్వగా వీరిలో 220 మందికి శంఖవరం మండల ప్రజా పరిషత్తు అధ్యక్షుడు పర్వత రాజబాబు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ … ఈ పట్టాలను వాస్తవంగా 20 మార్చి 2021 న పంపిణీ చేయాల్సి ఉందని, ఐతే ఈ భూములపై కొందరు న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని వేయడంతో నేటి వరకూ ఆలస్యం అయ్యిందని, ప్రస్తుతం వ్యాజ్యం పరిష్కారం అయ్యిందని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడడంతో ఈ భూముల పంపిణీకీ మార్గం సుగమం అయ్యింది అన్నారు. లబ్దిదారులకు నెల్లిపూడిలోని 196 సర్వే నెంబరులోని మఱ్ఱి చెరువు మెట్ట రెవెన్యూ కొండన, పంచాయితీ శివారు తిరుపతి అగ్రహారంలోని బెండపూడి స్వామీజీ ఆశ్రమం ముందున్న లేఅవుట్ల స్థలాల్ని ఇస్తున్నామని, ఈ రెండు చోట్లా కూడా పూర్తిగా స్థలం సరిపోనందున నెల్లిపూడికి 1.5 కిలో మీటరు దూరంలో ఉన్న సీతయ్యమ్మపేట లేఔటులో 42 మంది లబ్దిదారులకు వారి అంగీకారం మేరకు పట్టాలను ఇస్తున్నా మన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి గృహ నిర్మాణశాఖ ద్వారా రూ. 1,80,000 లను రుణంగా ప్రభుత్వం అందిస్తూ ఉందని, దీనికి తోడు ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం స్థల పట్టా తాకట్టుపై ఒక్కో లబ్దిదారుకు రూ. 3,00,000 చొప్పున రుణం ఇచ్చేందుకు ఓ ప్రైవేట్ బ్యాంకు ముందుకు వచ్చిందని తాహసిల్దార్ వెల్లడించారు. ఇప్పటికే ఈ స్థలాలను చదును చేసి, రోడ్లను, బోరు బావులను ఏర్పాటు చేసామని ఆయన పేర్కొన్నారు. ఈ సౌకర్యాలున్న నేపధ్యంలో అందరు లబ్దిదారులు సత్వరం ఇండ్లను నిర్మించుకుని, పధకాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలని శంఖవరం మండల తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం లబ్దిదారులకు పిలుపు నిచ్చారు. మండల గృహనిర్మాణశాఖ సహయక ఇంజనీర్ యాతం వెంకటరమణ, వీఆర్వో దేవసహాయం, స్థానికులు పలువురు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement