విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
రాజకీయ కారణాలతో ఉపాధి పనులు కల్పించలేదని ఆరోపించడం ఎమ్మెల్యే వేగుళ్ల కు తగదు. మండల వైసీపీ శ్రేణులు.
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )
నాగులచెరువు గ్రామంలో ఉపాధి కూలీలులకు గత రెండు నెలలుగా రాజకీయ కారణంగా పనికల్పించుట లేదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేసిన ఆరోపణలు అర్దరహితం అని మండల వైసీపీ నాయకులు విమర్శించారు. ఈ రోజు గురువారం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మే డిసెట్టి సత్య వేణి దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు, మండల సాగు సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు, వైసీపీ నాయకులు నక్కా సింహాచలం, కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలా ది వీరబాబు లు ఎమ్మెల్యే వేగు ళ్ల జోగేశ్వరరావు చేసిన ఆరోపణలను మీడియా సమావేశంలోఖండించారు.నాగులచెరువు గ్రామ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మరణించారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లేని కారణంగా తనే మస్తర్లు నిర్వహిస్తామని ఆ గ్రామ సర్పంచ్ వాసంసెట్టి సత్యనారాయణ ఉపాధి హామీ పథకం అధికారులను బెదిరిస్తున్నారని వైసిపి శ్రేణులు ఆరోపించారు. స్థానిక నాయుకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకుని రాగా ఆయన ఆదేశాలు తో టెక్నికల్ అసిస్టెంట్ నాగులచెఱువు గ్రామంలో చెయ్య వలసిన పనులు గుర్తించి జియోటాగ్ చేశారన్నారు. ఈ నెల 6 వ, తేదీ సోమవారం ఎన్ ఆర్ ఈ జీ ఎస్ సిబ్బంది ఉపాధి వేతనం హక్కుదారుల కు పనికల్పించే ఉద్దేశ్యంతో డిమాండ్ పేపర్లు, మస్తర్ పేపర్లు తీసుకొని నాగులచేరువు గ్రామం వెళ్ళితే ఎమ్మెల్యే వేగుళ్ల ప్రోద్బలం తో ఆ గ్రామ సర్పంచ్ అడ్డు కున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. మండలంలో 19 గ్రామాలు కి 18 గ్రామాల్లో పార్టి రహితంగా ఉపాధి హామీ పథకం పనులు జరుగుతుంటే మైనర్ గ్రామ పంచాయితి అయిన నాగుల చెరువు గ్రామంలో రాజకీయ దురుద్దేశ్యం అంటగట్టడం ఎమ్మెల్యే వేగుళ్ల కు తగదని వైసీపీ నాయకులు హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో వైస్ ఎంపీపీ గుణ్ణం భాను ప్రసాద్, నాగుల చెరువు పి ఎ సి ఎస్ చైర్ పర్సన్ మేడిసెట్టి గోవిందు, వైసీపీ అద్యక్షుడు మేడిశెట్టి త్రిమూర్తులు,కపిలేశ్వరపురం గ్రామ వైసీపీ అధ్యక్షుడు కట్టా మురళి కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ బొక్క రాంబాబు, మరివాడ సూరిబాబు, మార్ని పూసబ్బు, టేకి పి ఎ సీ ఎస్ చైర్ పర్సన్ మట్టపర్తి పాలరాజు తదితరులు పాల్గొన్నారు.