విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అయినవిల్లి:
అయినవిల్లి (విశ్వం వాయిస్)
అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామ వాలంటీర్ అయిన జనిపల్లి దుర్గా ప్రసాద్ మరణానికి కారణమైన వారిపై ఎస్టీ అట్రాసిటీ కేసు హత్యకేసు నమోదు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఆండ్ర మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాధిత దళిత కుటుంబానికి ప్రభుత్వాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారుఈ సందర్భంగా దళిత యువకుడు జనపల్లి దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజా సంఘాల ప్రతినిధి బృందం నేడు వారి కుటుంబాన్ని పరామర్శించి జరిగిందిఈ సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనూ దేశంలోనూ దళితులపై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నాయని ఈ దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించే ప్రయత్నం చేయడం లేదని దళితులకు రక్షణ లేకపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు జనుపల్లి దుర్గ ప్రసాద్ మరణానికి కారణమైన దోషులపై హత్య కేసు నమోదు చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రసాద్ బార్యకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఇల్లు ఇల్లు స్థలం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు హత్య లో సంబంధం ఉన్న వారందరి పైన నమోదు చేసి కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షురాలు కుడుపూడి రాఘవమ్మ కేవిపిఎస్ జిల్లా కన్వీనర్ పశ్చిమ వసంత్ కుమార్ మాదే విజయ్ కుమార్ సామాజిక కార్యకర్త పశ్చిమాల బాబ్జి గిడ్ల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు