విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం జూన్ 16 :
రాజమహేంద్రవరం ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు పరిధిలో గల రాజేంద్రనగర్ సెక్టారు లోని 25 అంగన్వాడి కేంద్రాలో కార్యకర్తలందరు కలిసి ఉల్లితోట బంగారయ్య స్కూల్ లో అంగనేవాడి, గ్రాడ్యుయేషన్ డే 5 సం. నిండిన ఫ్రీ స్కూలు పిల్లలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వార్డు ఇన్ఛార్జి చవ్యాకుల సుబ్రహ్మణ్యం గారు. ఐ.టి.సి ప్రీతం ప్రీస్కూల్ కరస్పాండెంట్ చిన్నా కృష్ణ, ఐ.సి.డి.ఎస్, సి.డి.పి.ఓ . సి.వి. నరసమ్మ , సూపరవైజర్లు జి. అచ్చి యమ్మ, వై. హిమశ్రీ , ఆ వార్డు ఎం.ఎస్. కె. సెక్టారు పరిధిలోని 25 మంది అంగన్ వాడి కార్యకర్తలు, హెల్బర్లు, ప్రేస్కూలు పిల్లల తల్లితండ్రులు.పాల్గొన్నారు. 84 మంది ప్రీస్కూలు పిల్లలకి గ్రాడ్యుయేషన్. – డే సందర్భంగా ప్రీస్కూలు సర్టిఫికెట్లు మేడర్స్ బహుకరిం చడం జరిగింది. అంగన్వాడి కేంద్రంలోని పిల్లలు కార్పొరేట్ పాఠశాలలకు
పిల్లలకు ధీటుగా జనరల్ నాలెడ్జ్ , తెలుగు
పద్యాలు యాక్షన్ సాంగ్ , తదితర వాటిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం జరిగింది.