Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి సర్పంచ్ చేరిక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:

 

తొండంగి: మే14: విశ్వం వాయిస్ న్యూస్:

అభివృద్ధి ఆగిపోయింది అంటూ.. దుష్ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి గడపగడపకు వెళ్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అభివృద్ధి కనిపిస్తుందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల గురించి, ప్రజల అభివృద్ధి గురించి వారు మాట్లాడారని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఒంటిమామిడి సర్పంచ్ అంగులూరి సుధాకర్ మంత్రి రాజా సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి రాజా సర్పంచ్ కు కండువాతో సత్కరించి, పార్టీలోకి ఆహ్వానించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసమే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అర్హులైన అందరికీ ఇల్లు ను మంజూరు చేస్తామని ఆయన అన్నారు. ఏవో సాంకేతిక కారణాల ఆగి ఉండవచ్చని వీలైనంత త్వరగా వాటిని కూడా పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు అందరికీ ఇలళ్లుని అందజేస్తామని తెలియజేశారు.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పధకాలు పొందని అర్హులైన వారు ఎవరు లేరని మంత్రి రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొయ్య మురళీకృష్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత ఆనందహరి, మండల ఎంపిపి అంగులూరి అరుణ్ కుమార్, మండల వైస్ ఎంపీపీ నాగం గంగ బాబు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మండల ఎంపీటీసీలు, మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement