విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
ఓ బాలిక అదృశ్యంపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయవరం ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ శుక్రవారం రాత్రి స్థానిక విలేకరులకు తెలిపారు. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పసలపూడి గ్రామ శివారు న సర్వరాయ తోట కు చెందిన వాసంశెట్టి లక్ష్మణ రావు తన కుమార్తె వాసం శెట్టి హిలెన్ గౌరీ (19) రామచంద్రపురం వి ఎస్ ఎం కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నది. గురువారం రాత్రి వారి ఇంటి పక్కన మేడపైన కుటుంబం అందరూ నిద్రపోతుండగా రాత్రి 11 గంటలకు తండ్రి లక్ష్మణరావుకు మెలుకువ వచ్చి చూడగా తన కుమార్తె గౌరీ కనిపించకపోవడం గమనించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఏమీ చేయలేని స్థితిలో రాయవరం పోలీసులను ఆశ్రయించారు. నిడదవోలు కు చెందిన
పెంటపాటి గగన్ పై అనుమానం ఉందని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయవరం ఎస్ ఐ సురేష్ తెలిపారు.