విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:
శంఖవరం, జూన్ 18, (విశ్వం వాయిస్ న్యూస్) ;
ఆ గుడిసెకు విద్యుత్ పన్ను భారం తగ్గించారు… నెలసరి విద్యుత్ పన్ను రూ. 11,000ల నుంచి రూ. 5333 లను తగ్గించారు… 2019 -20 సంవత్సరపు పాత బకాయి రూ. 4,570 చెల్లించాల్సిందేనని విద్యుత్ శాఖ ఖరాఖండీగా స్పష్టం చేసింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని కత్తిపూడిలోని కొండవారపుపేటలో చిట్టారపు కుమారి కుటుంబం చిన్న తాటాకింటిలో నివశిస్తున్నది. వీరు 3193 సంఖ్య విద్యుత్ మీటరుపై ఎస్సి సామాజిక వర్గీయులుగా ఐదేళ్ళుగా నెలవారీ విద్యుత్తు పన్నులో రాయితీని పొందుతూ ఉచిత విద్యుత్ పధకాన్ని వినియోగించు కుంటున్నారు. ఈ నెలలో మాత్రం విద్యుత్తు పన్ను రూ. 11,235 నమోదు చేసిన అధికారులు ఆమేరకు చెల్లించాలని బిల్లును ఆ కుటుంబీకుల చేతిలో ఉంచారు. దీంతో కుమారి కుమారుడు రాంబాబు శంఖవరం మండల విద్యుత్ శాఖ ఏఈ కుమార్ రాజాకు, ఆపై ప్రత్తిపాడు విద్యుత్ శాఖ ఏడిఈ రాజశేఖర్ కు విన్నవించు కున్నారు. ఈ నేపధ్యంలో ఆ బిల్లును పరిశీలించి మే నెలలో ఒక్క సారిగా వచ్చిన రూ. 5550 ను సరిచేయిటకు ప్రతిపానదనలను పంపి ఆ బిల్లును సవరిచించి, బిల్లు మొత్తం రూ. 11,000 నుంచి రూ. 5,333 లను మినహాయించామని, ఈ మార్పులు అనంతరం ఈ నెలకు వాస్తవంగా రూ. 1,097 చెల్లిస్తే సరిపోతుందని
కుమార్ రాజా శనివారం సాయంత్రం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఐతే 2019 -20 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయి మొత్తం రూ. 4,570 లను మాత్రం వినియోగదారులు ఖచ్చితంగా చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. పన్నుల విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకు వస్తే తక్షణమే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ మీటర్ల బిల్లులు తీసే విషయంలో రీడర్స్ కూడా తగు సూచనలు ఇచ్చి ఇటువంటివి పునరావృతం కాకుండా తగు చర్యలను తీసు కుంటామని శంఖవరం మండల విద్యుత్ వినియోగదారులకు ఆ శాఖ ఏఈ కుమార్ రాజా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఏఈ ” విశ్వం వాయిస్ న్యూస్ ” తో మాట్లాడారు. కుమారి కుటుంబంనకు వచ్చిన అదనపు పన్నును తగ్గింపునకు ధరఖాస్తు చేయమని తానే వియోగదారునికి సూచించి, పన్ను సవరణ ప్రతిపాదన సిఫారసు చేస్తూ ప్రత్తిపాడు విద్యుత్ శాఖ ఏడిఈ రాజశేఖర్ వద్దకు రాంబాబును తానే పంపానని, తాము పనిచేయడానికే ఉన్నామనీ, సక్రమంగా విద్యుత్ సరఫరా సేవలందిస్తూ, పరిస్థితిని చక్క దిద్దుతూ ఓ గాడిలో పెట్టుకుంటూ వస్తూన్నామనీ, చిన్న చిన్న సమస్యలనే బాహ్య ప్రపంచానికి వెల్లడించడం తమ విధుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తుందని, తద్వారా వేరే ప్రాంతానికి బదిలీ అయిపోవాలనే అసహనానికి పరిస్థితులు దారి తీస్తాయని ఆయన అంతరంగాన్ని వెల్లడించారు.