విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చిత్తూరు:
చింతూరు -విశ్వం వాయిస్ న్యూస్
18/06/2022
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , ఆధ్వర్యంలో ఏ ఎస్ పి. కే కృష్ణ కాంత్ పటేల్, ఓ ఎస్ డి జి కృష్ణ కాంత్ ఆదేశానుసారం శనివారం చింతూరు సిఐ అప్పలనాయుడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రేరణ పేరుతో నిరుద్యోగ గిరిజన మహిళలకు హోమ్ నర్సింగ్ నందు ఉచిత శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమం అవకాశాలు కల్పించే నిమిత్తం జిఎంఆర్ సంస్థ వారి నాగావళి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారి సహకారంతో హోమ్ నర్సింగ్ నందు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించబడుతుంది అని తెలిపారు. 30 రోజుల శిక్షణా కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయం యూనిఫామ్ ఉచితంగా అందజేయబడుతుంది అన్నారు. శిక్షణ కాలం కేవలం 30 రోజులు ఉంటుందని, దీనికి వయసు 19 నుండి 40 సంవత్సరాలు లోపు ఉండాలని పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండి గిరిజన మహిళ ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి మార్కులు లిస్టు ఒరిజినల్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ను తీసుకురావాలని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఉద్యోగం కల్పించబడుతుంది అని, నెలకు 15 వేల రూపాయలతో పాటు హైదరాబాద్లో ఉపాధి కల్పించబడుతుంది అన్నారు శిక్షణ కేంద్రం కేర్ హాస్పిటల్ పక్కన జిఎంఆర్ నగర్ రాజాం, విజయనగరం జిల్లాలో ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల గిరిజన మహిళలు తమ సమీప పోలీస్ స్టేషన్లో ను లేదా సచివాలయంలోని మహిళ కానిస్టేబుల్ లేదా గ్రామ వాలంటీర్ లను సంప్రదించి వివరాలను 27,, 6, 2022 లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. రంపచోడవరం లో నిర్వహించే గ్రీవెన్స్ డే లో ఎస్ పి సతీష్ కుమార్ అందుబాటులో ఉంటారని తెలియజేసినారు. ఈ అవకాశాన్ని అందరూ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.