Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మారేడుమిల్లి వాగులో దిగి ఇద్దరు యువకులు మృతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:

 

కపిలేశ్వరపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్

కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి వీక్షించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వాలమూరు వాగు లో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.వీరిలో కాళిదాస్ సందీప్ 20 సంవత్సరాలు ,దాన అరుణ్ కుమార్ 22 సంవత్సరాలు వాగులో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక సీఐ అద్దంకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ రాము గాలింపు చర్యలు చేపట్టారు.స్థానిక యువకులు గ్రామస్తులు వాగులో సుమారు గంటసేపు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement