Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** మమ్మల్ని ఆపేదెవరు **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– మాకు ఎటువంటి అనుమతులు లేవు ఎవరు మాట లెక్క చేయము మమ్మల్ని ఎవరు ఆపేది అంటూ జోరుగా
మట్టి తవ్వకాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం( విశ్వం వాయిస్)

వేసవికాలం వచ్చింది అంటే చాలు మొత్తం మట్టి మాఫియా చెలరేగుతున్నాయి.రోడ్డుమీద పిల్లలు,ముసలివాళ్ళు ఏరెవరైనా తిరిగిన మాకు అనవసరం.మేము మాత్రం అతివేగంగా వెళతాం అంటూన్న సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్, ఉప్పలగుప్తం మండలం అల్లవరం మండలంలో మట్టి తవ్వకాలు కు హద్దులు లేకుండా పోతున్నాయి.దానికి తగ్గట్టు ట్రక్టర్ ట్రాకు నిండా మట్టితో అతివేగంగా వెళ్లడం వల్ల ట్రాక్టర్ లు,లారీలు వెనుక వచ్చేవారికి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.ట్రాక్టర్ లు,లారీలు వెనుక వచ్చే వారి మీద మట్టి పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు మట్టి తవ్వకాలు కు మట్టి తరలింపుకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులే చెపుతున్నారు.కానీ అధికారులు కళ్లు ముందే మట్టి ట్రక్టర్ లు తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు .సామాన్యుడు ఒక వాహనం మీద వెళ్తే అతనికి వాహనం కి సంబంధించిన వి అన్ని ఉన్నాయా లెవా అని తనిఖీ చేసి ఏమి లేకపోతే అతనికి అపరాధ రుసుము వేస్తారు. కానీ ఇక్కడ రూల్స్ కి పూర్తి విరోధంగా అనుమతి లేకుండా మట్టి వాహనాలు తిరుగుతున్న ఎందుకు పట్టి పట్టనట్టు ఉంటున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు అమలాపురం రూరల్ మండలంలో 21 గ్రామాలు ఉన్నాయి .ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటారు.అతనిని వీఆర్వో అంటారు. తమ పనిచేసే గ్రామంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవడం అతని బాధ్యత,వేసవికాలం వస్తే మట్టి మాఫియా ఎక్కువగా జరుగుతుందని వీఆర్వోకి తెలుసు కానీ మట్టి తవ్వకాలు,మట్టి తరలింపు జోరుగా సాగుతున్న సరే నోరు మెదపరు. అసలు తమకి ఎటువంటి సంబంధం లేనట్టు వ్యవహరిస్తారు.గ్రామంలో జరిగేవి పట్టించుకోవడం లేదంటే అతని చేసే ఉద్యోగo సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారా, లేదా అనేది అర్థం అవుతుంది. తసీల్దార్ లు మాత్రం ఎటువంటి మట్టి తవ్వకాలు కు మట్టి తరలింపుకు అనుమతి లు లేవని చెపుతున్నారు.మట్టి తరలించేటప్పుడు అతి వేగంగా మట్టి ట్రక్టర్ లు,లారీలు వెళ్లడం వల్ల తరలించేమట్టి రోడ్డు పై పడి వర్షం వస్తే రోడ్డు అంత మట్టి అవ్వడంతో రోడ్డు మీద వెళ్లే ప్రజలకు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇప్పుడు ఉన్న పరిస్థితులు లో రోడ్డు చాలా దారుణంగా ఉన్న పరిస్థితి నెలకొంది. శనివారం అమలాపురం లో ఆంబులెన్స్ వెళుతుంది అదే సమయంలో వేమవరం నుండి ఈదరపల్లి వైపు మట్టి ట్రక్టర్ వెళ్ళింది. ఆంబులెన్స్ కి ఎటువంటి వాళ్ళు అయిన దారి ఇస్తారు .ఎవరికి ఏమి అయిందో పాపం అంటూ ఎవరికి ఎన్ని అర్జంట్ పనులు ఉన్న సరే ఆంబులెన్స్ దారి ఇస్తారు.కానీ ఇక్కడ మాత్రం ఆంబులెన్స్ ఆగి మట్టి ట్రక్టర్ కి దారి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.అంటే ఎంత దారుణంగా మట్టి వాహనాలు తిరుగుతూన్నాయో అర్థం చేసికోవచ్చు. ఈ అమలాపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా కు అడ్డుకట్ట అధికారులు వేశారో వేసి చూడాలి. మట్టి తవ్వకాలు తరలింపులు ఇంత ఇలా జరుగుతున్న అధికారులుఇంత నిర్లక్ష్యమా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement