విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :
జనసేన పార్టీ ఎటపాక మండలాధ్యక్షుడు మారాసు గంగాధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను ఆదివారం పార్టీ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు గంగాధర్ మాట్లాడుతూ ఎటపాక మండలంలో జనసేన పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని సభ్యత్వాలు చేయించుకున్న కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా కల్పించడం జరుగుతుందని ఏదైనా ప్రమాదవశాత్తు గాయపడినట్లయితే 10 వేల నుంచి 50 వేల వరకు ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొడ్డు.ఆనంద్ , మోల సతీష్ , మంద.సుబ్రహ్మణ్యం , వీరయ్య , నాగరాజు , సతీష్ , సాయి , నవీన్ , శివ , చైతన్య , మైపా.సాయి , సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.