విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్):
పంటలభీమా పేరుతో వైకాపా ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు దుయ్యబట్టారు. కోనసీమ జిల్లా అలమూరులో అన్నదాతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏకంగా పంటకాల్వకు సైతం నష్ట పరిహారం అందింది కానీ నిజంగా నష్టపోయిన రైతులకు మాత్రం పరిహారం అందలేదని, ఆర్బీకే సెంటర్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లు రాబందుల్లా రైతుల మీద పడి దోచేశారని అన్నారు. ఆలమూరు గ్రామంలో భూమికి సంబంధించి సూర్యరావుపేట చెందిన 17 మంది రూ.10,87,362 స్వాహా అయ్యిందన్నారు. ఒక ఊరిలోనే సుమారు పాతిక, ముప్ఫై లక్షల అవినీతి జరిగిందంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగిందని, ఎంత సొమ్ము ఈ నాయకులు కాలకేయులు దోచేశారోనని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావుని అన్నారు. రైతు పంట పండిద్దామంటే పంట కాలువలు బాగు చెయ్యరు, సమయానికి యూరియా దొరకదు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతాయి, ఇన్ని కష్టాలు పడి పంటలు పండిస్తే చివరకి అమ్ముకోవడానికి ఈ క్రాప్ అంటూ, ఆన్ లైన్ అంటూ రైతుల్ని నానా హింసలు పెడతారని అన్నారు. అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు రావాలంటే నెలల తరబడి నిరీక్షణ, ఇప్పుడు ఏకంగా ఖరీఫ్ క్రాప్ ఇన్సూరెన్స్ లో ఇంత పెద్ద అవినీత జరిగిందనిఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రతీ ఒక్కరూ దోపిడీ దారులుగా మారి ఎలా సామాన్య సన్నకారు, పేద రైతుల్ని దోచేస్తున్నారో ఇదే సాక్ష్యం మని అన్నారు.ఈ క్రాప్ పేరుతో ఈ ప్రభుత్వం రైతుల్ని మభ్యపెట్టి, మాయచేసి చేస్తున్న అవినీతి దోపిడీకి నిదర్శనమని అన్నారు. అనంతరం ఆలమూరు మండల తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చి నష్టంపోయిన రైతులకు న్యాయం చేయాలని అన్నారు.