విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ : దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారి కార్యాలయం బుధవారం ప్రారంభమైంది.కాకినాడ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని డీసీ మేడిపల్లి విజయరాజు ప్రారంభించి జిల్లా అధికారి పులి నారాయణ మూర్తి కి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాదాయ శాఖ కాకినాడ ఇన్స్పెక్టరు వడ్డి ఫణికుమార్, పలు దేవాలయాల ఈవోలు, డీసీ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలుగా విభజన తరువాత కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లాకు తనను అధికారిగా ప్రభుత్వం నియమించిందని గత నెల 14న బాధ్యతలు స్వీకరించినా ఇప్పుడు కొత్త కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డీసీ సూచనలు మేరకు సహచర ఈవోలు,సిబ్బంది సహకారంతో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.