Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కాల్ డేటా బయట పెట్టాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కాల్ డేటా ను బయటపెట్టాలి
అధికార అహంతో దళితులపై దాడులు చేయూస్తున్న ఎమ్మెల్యే చిర్ల
నిగ్గీరెడ్డి మాట్లాడే మాటలన్నీ అవస్థవాలే
టీడీపీ నాయకులు ధ్వజం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

మండలం లోనో గోపాలపురం లో అంబేద్కర్ ను అవమానించిన ఘటనలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన నాటకాలు కట్టిపెట్టి ఈనెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తన ఫోన్ కాల్ డేటా బయటపెట్టి తన నిజాయితీని నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ సవాల్ చేసారు. రావులపాలెం టీడీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు సత్యానందరావు అధ్యక్షతన పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆనందసాగర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో పరుపులు వేసుకుని పడుకుని, టీలు తాగి డ్రామాలు ఆడితే ఇక్కడ చూసి నమ్మేందకు ఎవరు చెవిలో పువ్వులు పెట్టుకోలేదన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేసారని, ఎవరూ ఈ విధంగా దళితులపై దాడులు, కేసులు, హింసకు పాల్పడలేదని అన్నారు. ఆయన తండ్రి సోమసుందరరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేసినా దళితులపై ఈవిధంగా దాడులు చేయలేదన్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డిది దుందుడుకు స్వభావం అని, కులహంకారం, ధనహంకారం, అధికార అహంతో రెచ్చిపోతూ బలహీనులు, బడుగులైన దళితులపై తన కులం వారిని దాడులు, దౌర్జన్యాలకు పురిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే , చిత్తశుద్ధి ఉంటే ఈ దళితుల ఓట్లతో గెలిచానన్న విశ్వాసం ఉంటే ఈనెల 5వ తేదీ నుంచి 10 వరకు తన ఫోన్ కాల్ డేటా బయటపెట్టి నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేసారు. మాజీ అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ గతంలో గోపాలపురంలో దళితులపై జగ్గిరెడ్డి బంధువులు దాడులు చేసిన రెండు ఘటనల్లో తన సామాజిక వర్గానికి చెందిన వారి కోసం కేసులు నీరుగార్చేసారన్నారు. నేడు సాక్షాత్తు అంబేద్కర్ నే అవమానించి, ప్రశ్నించిన దళిత యువకులపై గత కేసులు దృష్టిలో పెట్టుకొని కేసులు పెట్టించి, అరెస్టు చేయించి తిరిగి పోలీస్ స్టేషన్లో అద్భుతమైన నటన ప్రదర్శించి దళితులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేసారు.అంబేద్కర్ చిత్రం ముద్రించి ఉన్న పేపర్ ప్లేట్లు జగ్గిరెడ్డి బంధువు హోటల్ కి మాత్రమే ఎలా వస్తాయి, అన్ని దుకాణాల్లో ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే గడగడలాడే ఎస్సై, సీఐలు ఆయనను కాదని ఎలా కేసులు నమోదు చేస్తారని, ఇదంతా జగ్గిరెడ్డి కుట్ర అన్నారు. దళితుల ఓట్లతో నెగ్గి, దళితులపైనే దాడులు చేయిస్తున్న జగ్గిరెడ్డి ఆ పదవికి అర్హుడు కాదని, గోపాలపురం ఘటనకు బాధ్యత వహించి ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత మూడేళ్లలో దళితులపై అత్యాచారాలు, దాడులు, అక్రమ కేసులు పెరగిపోయాయన్నారు. గోపాలపురం ఘటనలో దళిత యువకులపై పెట్టిన కేసులు తప్పుడు కేసులుగా నిర్దారణ అయినందున, వెంటనే కేసులు ఎత్తివేయాలని లేనిపక్షంలో టీడీపీ న్యాయపోరాటం చేస్తుందని స్పష్టం చేసారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గిరెడ్డి పై తొమ్మిది తప్పుడు కేసులు పెట్టించానని ఆరోపణలు చేస్తున్నారని, అయితే అది అవాస్తవం అని తాను ఎలాంటి తప్పుడు కేసులు పెట్టించలేదని అన్నారు. దీనిపై ఏ ఆలయం, చర్చి, మసీదుల్లో అయినా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, ఆయన అధికారంలో ఉండగా ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టలేదని ప్రమాణం చేసేందుకు సిధ్ధమా అని సవాల్ విసిరారు. టీడీపీ రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ గోపాలపురం దళిత యువకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో టీడీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభి రామారావు, నియోజకవర్గ బీసి విభాగం అధ్యక్షుడు కాసా విజయసాగర్, మేడపాటి కాసురెడ్డి, బండారు వెంకట సత్తిబాబు, పడాల బులి కొండారెడ్డి, ముత్యాల బాబ్జి, గుబ్బల మూర్తి తదితరులు పాల్గొన్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement